2020-21 – తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ – రూ.1,82,914 కోట్లు

Mango News Telugu, telangana, Telangana Assembly Session, Telangana Assembly Session 2020, Telangana Breaking News, Telangana Budget, Telangana Budget 2020, Telangana Budget 2020-21, Telangana Govt, Telangana Govt Budget, Telangana govt tax-free budget

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడో రోజున తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని విధాలుగా సమతుల్యతతో ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్‌ ఇది అని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గడం, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా ఉండే విధంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయమన్నారు. మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బడ్జెట్‌ రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఆర్థిక శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని చెప్పారు. బడ్జెట్‌ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెలు కాదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఎక్కువ శాతం నిధులు కేటాయించారు.

బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  • రెవెన్యూ వ్యయం – రూ.1,38,669.82 కోట్లు
  • రెవెన్యూ మిగులు – రూ.4,482.18 కోట్లు
  • పెట్టుబడి వ్యయం – రూ.22,061.18
  • ఆర్థిక లోటు – రూ.33,191.25 కోట్లు
  • రైతు బంధు కోసం – రూ.14వేల కోట్లు
  • రైతు బీమా కోసం – రూ.1,141 కోట్లు కేటాయింపు
  • రైతు రుణమాపీ కోసం – రూ. 6,225 కోట్లు
  • ఆసరా పెన్షన్లు – రూ. 11,758 కోట్లు
  • ఎస్సి, ఎస్టీల ప్రగతి నిధులు – రూ. 26,306 కోట్లు
  • మైనార్టీ అభివృద్ధి, సంక్షేమం – రూ.1518 కోట్లు
  • కల్యాణ లక్ష్మీ – రూ.1350 కోట్లు
  • పశు పోషణ, మత్య శాఖ – రూ.1586 కోట్లు
  • సాగునీటి రంగం – రూ.11,054 కోట్లు
  • వెనుకబడిన వర్గాల సంక్షేమం – రూ.4356 కోట్లు
  • పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి – రూ.23,005 కోట్లు
  • మున్సిపల్ శాఖ – రూ.14,809 కోట్లు
  • పాఠశాల విద్యాశాఖ – రూ.10,421 కోట్లు
  • ఉన్నత విద్యాశాఖ – రూ.1,723 కోట్లు
  • నిరక్ష్యరాస్యత నిర్ములన – రూ.100 కోట్లు
  • వైద్య రంగం – రూ.6,186 కోట్లు
  • విద్యుత్ శాఖ – రూ.10,416 కోట్లు
  • పారిశ్రామిక రంగ అభివృద్ధి – రూ. 1998 కోట్లు
  • గృహ నిర్మాణం – రూ.11,917 కోట్లు
  • పర్యావరణ, అటవీ శాఖ – రూ.791 కోట్లు
  • పోలీస్ శాఖ – రూ.5852 కోట్లు
  • రవాణా,రోడ్లు భవనాల శాఖ – రూ.3494 కోట్లు
[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =