పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి ఆ ముగ్గురు పోటీ..?

Those Three Will Contest From Medak in the Parliament Elections,Those Three Will Contest From Medak,Medak in the Parliament Elections,Contest From Medak,Parliament elections, Medak, KCR, Etela Rajender, Vijayashanti,Mango News,Mango News Telugu,Eatala and Raghunadan In Race,Parliament Elections Latest News,Parliament Elections Latest Updates,Parliament Elections Live News,Etela Rajender Latest News,Etela Rajender Latest Updates,Medak Latest News,Medak Latest Updates
Parliament elections, Medak, KCR, Etela Rajender, Vijayashanti

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందితే.. తెలంగాణలో కాంగ్రెస్, మిజోరాంలో జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ విజయం సాధించాయి. అయితే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలవేడి తగ్గినప్పటికీ.. తెలంగాణలో మాత్రం ఇంకా చల్లారలేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. పార్లమెంట్ ఎన్నికల వేడి క్రమక్రమంగా రాజుకుంటోంది. ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మహామహుల మధ్య పోటీ నెలకొననుంది.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన దిగ్గజ నేతలంతా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఈటల రాజేందర్ రెండు చోట్ల ఓడిపోయారు. ఈక్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కవ. దీంతో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈటల రెడీ అవుతున్నారు.

మరోవైపు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆయన కూడా పార్లమెంట్ ఎన్నికలపైనే ఆశలు పెట్టుకున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో రఘునందన్ రావు మెదక్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో ఈసారి కూడా మెదక్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే అధిష్టానం మాత్రం ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు మెదక్ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ కూడా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్‌లోరి 7 అసెంబ్లీ స్థానాల్లో 6 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈక్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమదే హవా ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోందట. అటు కాంగ్రెస్ నుంచి విజయశాంతి రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కేసీఆర్, విజయశాంతి, ఈటల రాజేందర్ మధ్య త్రిముఖ పోటీ పోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు..? ఏ పార్టీకి పట్టం కడుతారనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seven =