ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఖరారు

BJP focus, Telangana,Prime Minister Modi, Narendra Modi, Amit Shah, Bandi Sanjay, K. Laxman, Abhay Patil, Raghunandan Rao, BJP
BJP focus, Telangana,Prime Minister Modi, Narendra Modi, Amit Shah, Bandi Sanjay, K. Laxman, Abhay Patil, Raghunandan Rao, BJP

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ముమ్మరం చేయనుండటంతో.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూరు ఖరారు అయింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ఏప్రిల్ 30న ఆ తర్వాత మే 3, 4 తేదీల్లో పర్యటించబోతున్నారు. ఏప్రిల్ 30న అందోల్ నియోజకవర్గంలో జరిగే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకాబోనున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ రానున్న ప్రధాని.. శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో భేటీ అవుతున్నారు.

అలాగే మే 3న వరంగల్ లోక్‌సభ నియోజకర్గం పరిధిలో నిర్వహించబోతున్న సభల్లో కూడా  ప్రధాని మోడీ పాల్గొంటారు. అంతేకాదు..అదే రోజు భువనగిరి, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు ప్రధాని హాజరవుతున్నారు. ఆ మర్నాడు అంటే మే 4న నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించబోయే బీజేపీ భారీ బహిరంగ సభల్లోనూ ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు.

ఇటు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణపై ఫోకస్ పెంచిన కాషాయ పార్టీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ బాట పడుతున్నారు. ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు అంటే ఏప్రిల్ 25న  తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. సీఈసీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక.. అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావడం ఇదే ఫస్ట్ టైమ్.  సిద్దిపేటలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. కమలం పార్టీ  అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు తరఫున అమిత్ షా ఈ ప్రచారం నిర్వహించనున్నారు.

సిద్ధిపేటలో జరిగే బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి  కిషన్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్చార్జి అభయ్ పాటిల్, మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావు తదితరులు పాల్గొంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 7 =