విజయవాడ వెస్ట్‌లో వినిపించని టీడీపీ పేరు

An Unheard Name Of TDP In Vijayawada West, TDP In Vijayawada West, TDP in Vijayawada West, Vijayawada West, Sujana Chowdary, Vellam Pally Srinivas, YCP, TDP, Janasena, Chandrababu, Jagan, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
TDP in Vijayawada West,Vijayawada West,Sujana Chowdary, Vellam Pally Srinivas,YCP, TDP, Janasena, Chandrababu, Jagan,

ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం..నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి  విజయాన్ని ఊరిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983లో జరిగిన తొలి ఎన్నికలలో మాత్రమే ఆ పార్టీ విజయవాడ వెస్ట్‌లో గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ పార్టీకి అక్కడ విజయాన్ని సాధించిందే లేదు.

1983లో విజయవాడ వెస్ట్ నుంచి బీఎస్ జయరాజు టీడీపీ అభ్యర్ధిగా గెలిచారు.  ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ 12 సార్లు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పార్టీ  ఐదు సార్లు, కమ్యూనిస్ట్ పార్టీలు మూడు సార్లు, వైసీపీ  రెండుసార్లు గెలవగా.. టీడీపీ, ప్రజారాజ్యం పార్టీ  ఒక్కొక్కసారి గెలిచాయి.

ఈ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికలలో టీడీపీ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళుతుండటంతో.. మైనారిటీ వర్గాల సపోర్ట్ వుంటుందా అన్న చర్చ నడుస్తోంది.  ముఖ్యంగా ముస్లిం ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో.. పొత్తుల ప్రభావం ఎలా ఉండనుందనే టాక్ నడుస్తోంది.

దీనికి ఉదాహరణగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌నే తీసుకుంటే.. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన గతంలో బీజేపీ, ప్రజారాజ్యం పార్టీల నుంచి అక్కడ నుంచే పోటీ చేసారు. అయితే బీజేపీ తరపున పోటీ చేసినప్పుడు తప్ప మిగతా రెండుసార్లు కూడా వెల్లంపల్లి విజయం సాధించారు. దీన్నిబట్టే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

2014, 2019లో జరిగిన ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీనే అక్కడ ఓటర్లు ఆదరించారు. అయితే 2014 లో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జలీల్ ఖాన్..ఇప్పుడు టీడీపీలో  కొనసాగుతున్నారు. 2019 లో జలీల్ ఖాన్ కూతురు షబాన ముసరత్ ఖాతూన్ టీడీపీ తరపున పోటీ చేసినా కూడా ఎందుకో వెల్లంపల్లి చేతిలో ఓడిపోయారు.

ఇప్పుడు జరగబోతున్న 2024 అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ పశ్చిమ సీటు నుంచి వైసీపీ అభ్యర్థిగా షేక్ అసీఫ్ పోటీ చేస్తున్నారు.  టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సుజనా చౌదరిని ప్రకటించారు. ఈ ఎన్నికలలో సుజనా చౌదరి గెలిచినా కూడా  ఈ సీటు టీడీపీ ఖాతాలో పడే అవకాశం లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 18 =