నేడు విజయవాడలో “జనవాణి-జనసేన భరోసా”: సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan to Held Janasena-Janavani Program Today at Vijayawada, Janasena-Janavani Program Today, Vijayawada Janasena-Janavani Program Today, Janasena Party Chief Pawan Kalyan to Held Janasena-Janavani Program Today at Vijayawada, Janasena-Janavani Program, Jana Sena chief Pawan Kalyan will participate in the Janavani Jana Sena Bharosa program, Janavani Jana Sena Bharosa program, Janavani programme at MBVK Bhavan, Janavani Jana Sena Bharosa program Today at Vijayawada, Chief Pawan Kalyan, Janasena Party President Pawan Kalyan, Pawan Kalyan, Janasena Party, Janavani Jana Sena Bharosa program News, Janavani Jana Sena Bharosa program Latest News, Janavani Jana Sena Bharosa program Latest Updates, Janavani Jana Sena Bharosa program Live Updates, Mango News, Mango News Telugu,

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు (జూలై 3, ఆదివారం) విజయవాడలో “జనవాణి-జనసేన భరోసా” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, సామాన్యుడి గళం వినబడేలా జనసేన పార్టీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి, సమస్యలతో సతమతం అవుతున్న బాధిత పక్షాల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించనున్నారు. వరుసగా వచ్చే ఐదు ఆదివారాల్లో జనవాణి కార్యక్రమం నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది.

అందులో భాగంగా ముందుగా జులై 3, ఉదయం 10 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండి వచ్చిన ప్రతి అర్జీని స్వీకరించనున్నారు. అనంతరం పార్టీ ప్రతినిధులు వెంటనే అక్కడే అర్జీ తాలూకు రసీదు అందచేస్తారు. అలాగే సాయంత్రానికల్లా సంబంధిత అధికారులకు సమస్యలు చేరేటట్లు ప్రయత్నం చేసి, మరుసటి రోజు నుంచి సమస్య పరిష్కారమయ్యే విధంగా పార్టీ కార్యాలయం నుంచి ఫాలో అప్ చేస్తారని పేర్కొన్నారు. తొలి రెండు ఆదివారాలు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమం జరుగుతుందని, ఆ తరువాత ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉంటాయని జనసేన పార్టీ వెల్లడించింది. అయితే జనవాణి కార్యక్రమం సందర్భంగా శాలువాలతో సత్కరించడం, బోకేలు ఇచ్చేందుకు సమయం వృధా చేయొద్దని, ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 8 =