తెలంగాణ బీజేపీ కార్యకర్తలు అసాధారణ పోరాటం చేస్తున్నారు, వారి తీరు నన్నెంతో ప్రభావితం చేసింది – ప్రధాని మోదీ

PM Modi Reaches Hyderabad and Addressed in Public Meeting at Begumpet Airport, PM Modi Addressed in Public Meeting at Begumpet Airport, PM Modi at Begumpet Airport, PM Modi Reaches Hyderabad, Begumpet Airport Public Meeting, PM Modi Telangana Tour Schedule, PM Modi Telangana Tour, PM Modi at Telangana, PM Modi Telangana Visit, PM Modi in Telangana, Prime Minister Narendra Modi, Narendra Modi, Begumpet Airport, PM Narendra Modi in Telangana, PM Modi Telangana Tour News, PM Modi Telangana Tour Latest News And Updates, PM Modi Telangana Tour Live Updates, Mango News, Mango News Telugu

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఏపీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ విశాఖ నుంచి నేరుగా బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ అక్కడ తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక ఎంఎల్ఏ రఘునందన్, పార్టీ నేతలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ప్రధానితో పాటు బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు అసాధారణ పోరాటం చేస్తున్నారని, వారి పోరాట పటిమ నన్నెంతగానో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. అలాగే మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం అభినందనీయమని, తెలంగాణ ప్రజలను కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించడం తమ బాధ్యతని పేర్కొన్నారు. 1984లో పార్లమెంటులో బీజేపీకి ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తోందని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒక్క కుటుంబం కోసం కాకుండా ప్రతి కుటుంబం కోసం పనిచేసే బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.

పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టబోమని తెలంగాణ ప్రజలకు నేను భరోసా ఇవ్వాలనుకుంటున్నానని తెలిపిన ప్రధాని.. ప్రస్తుతం తెలంగాణ అంధకారంలో మగ్గుతోందని, త్వరలోనే సూర్యోదయం రాబోతోందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు మతిస్తున్నానని, అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తానని స్ఫష్టం చేశారు. తెలంగాణ పేరు చెప్పుకుని కొందరు జేబులు నింపుకుంటున్నారని, అలాంటి వారిని వదిలేది లేదని హెచ్చరించారు. కొందరు భయంతో నన్ను బూతులు తిడుతున్నారని, అలాంటివారి మాటలను నేను పట్టించుకోనని అన్నారు. నన్ను తిట్టినా నేను సహిస్తాను కానీ, తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం ఉరుకోబోనని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇక ప్రసంగం అనంతరం ప్రధాని రామగుండం బయల్దేరి వెళ్ళారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + nineteen =