ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం – ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్‌

Polavaram Project Will Be Completed Without Fail CM Jagan Announces in AP Assembly, Polavaram Project Will Be Completed Without Fail, CM Jagan Says That Polavaram Project Will Be Completed Without Fail, Polavaram Project, Polavaram Project Latest News, Polavaram Project Latest Updates, AP Assembly Budget Session, Assembly Session 2022, AP Budget Session 2022, Budget Session, Andhra Pradesh Budget Session, AP Budget Session, 2022 AP Budget Session, AP Assembly Budget Session 2022-23, AP Assembly Budget Session 2022, AP Assembly Budget Session, AP Assembly Budget, Andhra Pradesh assembly budget session, AP Budget 2022-23, AP Budget 2022, AP Budget, Andhra Pradesh, Andhra Pradesh Assembly, AP Assembly, AP Assembly Session, Budget Session 2022, Mango News, Mango News Telugu,

ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. ఈరోజు అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు.. రాష్ట్రానికి ప్రధాన నీటి వనరు అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టుని నిర్మించి పూర్తిచేస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు. సరైన ప్రణాళిక లేకుండా చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిందని, దానివల్లే ఇప్పుడు అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి ముందే స్పిల్‌వే కట్టాల్సిందని, కానీ వారు స్పిల్‌వే పూర్తి చేయకుండానే కాఫర్‌ డ్యామ్‌ కట్టారని, ఈ నిర్మాణంలో జరిగిన పొరపాటు వల్లనే ఇప్పుడు ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరుగుతోందని సభకు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తుందని బయట ప్రజల్లో అపోహలు పెంచే విధంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, ప్రాజెక్ట్ లో ఒక్క ఇంచ్ కూడా తగ్గదని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2013-2014 అంచనాల ప్రకారమే ప్రాజెక్టు కడతామని చెప్పారు. 2023 ఖరీఫ్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో నిర్మాణం చేపడుతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. కేంద్రప్రభుత్వ సహకారంతో ఆర్‌ఆండ్‌ఆర్‌ పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం వద్ద వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని, ప్రాజెక్టును వైఎస్సార్‌కు అంకితం చేస్తామని కూడా సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =