రేపు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతల ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు

BRS Leaders and Activists To Plan Many Events Across Telangana Tomorrow on For CM KCR's Birthday,CM KCR's birthday tomorrow,Many service programs,BRS leaders across Telangana,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 69వ జన్మదిన వేడుకలను శుక్రవారం (ఫిబ్రవరి 17, 2023) ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగే వేడుకల వివరాలను పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అంతకుముందు ఆయన ఈ కార్యక్రమాల నిర్వహణపై ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి తదితరులతో చర్చించారు. మంత్రి తలసాని చెప్పిన ప్రకారం.. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని థ్రిల్ సిటీలో ఘనంగా వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా జానపద కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

అలాగే హైదరాబాద్‌లోని ప్రముఖ దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలతో పాటు అన్ని ప్రార్థనా స్థలాల్లో సీఎం కేసీఆర్ ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయంలో, సికింద్రాబాద్‌లోని గణేష్‌ ఆలయంలో చండీయాగం నిర్వహించనుండగా.. వివిధ హోమాలు, యాగాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇంకా అనేకచోట్ల రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ మరియు ఇతర సామాజిక కార్యక్రమాలతో పాటు కేక్ కటింగ్ వేడుకలు నగరవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు మున్సిపల్ కార్పొరేటర్ల నేతృత్వంలో నిర్వహించబడతాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై జబర్దస్త్‌ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు, ఐదుగురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ వంటివి చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని జార్ఖండ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 19 =