ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు

Covid Vaccination, Covid Vaccination For 12-14 Age Group, Covid Vaccination For 12-14 Age Group Likely to be Starts, Covid Vaccination For 12-14 Age Group Likely to be Starts by February, Covid Vaccination For 12-14 Age Group Likely to be Starts by February Month End, Covid vaccination for children, Covid vaccination in India, COVID-19, Covid-19 vaccination for 12-14 age group, India may begin vaccination for 12-14 year age group, Mango News, Vaccination For 12-14 Age Group, Vaccination For 12-14 Year Olds, Vaccination Of 12-14 Age Group

భారత ప్రభుత్వం ఈ మధ్యే టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే.. 12 నుంచి 14 ఏళ్ల వారికి కోవిడ్-19 వ్యాక్సిన్‌లు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చీఫ్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. జనాభాలో 15-18 ఏళ్ల వాళ్లు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నారని అరోరా చెప్పారు. వీరిలో దాదాపు 3.45 కోట్ల మందికి పైగా కోవిడ్ తొలి డోసును వేయించుకున్నారని తెలిపారు. కాగా తదుపరి డోసు 28 రోజుల్లో ఇస్తారని ఎన్టీఏజీఐ వర్కింగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు.

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో.. ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12-14 ఏళ్ల బాలబాలికలకు కూడా వ్యాక్సిన్లు ఇస్తామని కోవిడ్‌పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ చైర్మెన్ ఎన్‌కే అరోరా తెలిపారు. 12 నుంచి 17 ఏళ్ల వయసువారికి భారత్ బయోటెక్‌‌ తయారుచేసిన కోవ్యాగ్జిన్‌ను అత్యవసర వినియోగం కోసం కేంద్రం ఇప్పటికే అనుమతి జారీ చేసింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసువారిలో జనవరి 3 నుంచి మూడున్నర కోట్ల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =