1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర

TDP National General Secretary Nara Lokesh YuvaGalam Padayatra Completes 1000 Kms in 77 Days,TDP National General Secretary Nara Lokesh,Nara Lokesh YuvaGalam Padayatra,YuvaGalam Padayatra Completes 1000 Kms in 77 Days,Nara Lokesh YuvaGalam Padayatra in 77 Days,Mango News,Mango News Telugu,Nara Lokesh has 1 case for every 33 km he covers,Yuvagalam padayatra,Nara Lokesh YuvaGalam Padayatra Latest News,Nara Lokesh YuvaGalam Padayatra Live Updates,YuvaGalam Padayatra News Today

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన యువగళం పాదయాత్ర 1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ మేరకు 77వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని శివారు క్యాంప్ సైట్ నుండి ప్రారంభించిన యాత్ర.. సిరిగుప్ప క్రాస్ వద్ద పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నారా లోకేష్ సిరిగుప్ప క్రాస్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ సంఘం, ముస్లిం ప్రజలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటలకు కడికత్త క్రాస్ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించనున్నారు. కాగా ఈ పాదయాత్రలో లోకేష్ అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను వింటూ ఉత్సాహంగా నడుస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =