ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల – ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

AP Education Minister Botsa Satyanarayana Announces DSC Notification will be Released Soon,AP Education Minister Botsa Satyanarayana,Botsa Satyanarayana Announces DSC Notification,DSC Notification will be Released Soon,Mango News,Mango News Telugu,AP DSC 2023 Notification Soon,AP minister botsa satyanarayana comments,AP Education Minister Latest News,Minister Botsa Satyanarayana Latest News,DSC Notification Latest Updates,AP DSC Notification Latest News

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం ఆయన అనేక విషయాలపై మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇక ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్స్ బదిలీలపై సమీక్షించామని, త్వరలోనే బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని, దీని కోసం ఇతర రాష్ట్రాలలో ఉన్న చట్టాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, సీఎం జగన్ ఈ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు.

ఇక ఏపీ వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ నిలిపివేశారంటూ జరుగుతోన్న ప్రచారం తప్పు అని, ఇది కేవలం తాత్కాలికమేనని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పరీక్షలు, ఒంటి పూట బడుల వలన ప్రస్తుతానికి రాగి జావకు బదులుగా మరో పౌష్టికాహారమైన చిక్కీలు ఇస్తున్నామని, అయితే వేసవి సెలవుల అనంతరం తిరిగి యథావిధిగా రాగి జావను అందిస్తామని వెల్లడించారు. కాగా విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఉండాలనేది తమ పార్టీ విధానమని, మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తమతో పాటు ప్రజలు కూడా ఆమోదిస్తున్నారని చెప్పారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని, అయితే ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =