వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీం

YS Vivekananda Reddy Assassination Case SC Gives Stay On High Court Orders Regarding MP Avinash Reddy Bail,YS Vivekananda Reddy Assassination Case,SC Gives Stay On High Court Orders,High Court Orders Regarding MP Avinash Reddy Bail,Mango News,Mango News Telugu,Ex-Minister Murder Case,SC Gives Stay On Avinash Reddy's Bail,SC StaYS Interim Bail Of Avinash Reddy,Don'T Arrest Kadapa MP Avinash Reddy,YS Avinash Reddy Seeks Pre-Arrest Bail,SC Issues Notice To CBI,Ex-Minister Murder Case,YS Sunitha Reddy Approaches SC Against Stay,Kadapa MP Moves Telangana HC,While Telling Avinash Not To Be Arrested,YS Avinash Reddy To Attend CBI Inquiry,Viveka Murder Case,CBI Issues Summons To MP YS Avinash Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రోజుకో ట్విస్టుతో నడుస్తున్న ఈ కేసు వ్యవహారం శుక్రవారం మరో మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు నేడు వివేకా కుమార్తె సునీతా రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. ఈ పరిణామంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై స్టే విధిస్తే.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ఆయన తరపు న్యాయవాది వాదించారు.

దీనిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ మరియు జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన దిసభ్య ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే, సోమవారం (ఈ నెల 24వ తేదీ) దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడుతామని, అప్పటి వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈనెల 30వ తేదీలోపు ఈ కేసు విచారణ పూర్తి చేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అవసరాన్ని బట్టి పొడిగిస్తామని కూడా స్పష్టం చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఇదిలా ఉండగా.. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి వరుసగా మూడోరోజు శుక్రవారం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =