విశాఖ సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా, 8 మంది గల్లంతు

1 killed 7 missing as two boats capsize, 8 Migrant Workers Go Missing After Boat Capsizes in Sileru, At Least 8 Persons Missing, Boat Capsizes in Sileru, Boats Capsize in Visakha Sileru River, Mango News, Migrant Workers Go Missing After Boat Capsizes, One dead 7 missing as country boats capsize in river, seven missing after two boats capsize in Andhra, Two Boats Capsize in Visakha Sileru River, Visakha Sileru River, Vizag Boats Accident, Vizag Boats Accident News

విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సీలేరు రిజర్వాయర్ లో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ రెండు నాటు పడవల్లో మొత్తం 11 మంది వలసకూలీలు ప్రయాణిస్తుండగా, ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. ప్రమాదం నుండి బయటపడి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు గాలింపు చర్యల్లో చిన్నారి మృత‌దేహం ల‌భ్య‌మైందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిని హైదరాబాద్ లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన వలసకూలీలుగా గుర్తించారు.

ముందుగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఒడిశా వెళ్ళేందుకు హైదరాబాద్ నుంచి వ‌ల‌స కూలీలు సీలేరుకు చేరుకున్నారు. ముందుగా కొందరు వలసకూలీలు సీలేరు రిజర్వాయర్ మీదుగా నాటు పడవలపై వారి గ్రామాలకు చేరుకున్నట్టు తెలుస్తుంది. కాగా మంగళవారం రాత్రి మరో ఐదు పడవల్లో వలసకూలీలు వెళ్తుండగా వాటిల్లో రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనతో వలసకూలీల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మరోవైపు గల్లంతైన ఏడుగురి కోసం అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేపడుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 9 =