టీడీపీలోకి వసంత రాకకు మోకాలడ్డుతున్న దేవినేని ఉమ

Vasantha Krishna prasad, Devineni Uma, TDP, AP Elections, YSRC, Devineni Umamaheshwara Rao, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, Andhra Pradesh, YCP MLA, mailavaram, Mango News Telugu, Mango News
Vasantha Krishna prasad, Devineni Uma, TDP, AP Elections

మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైలవరం టికెట్ నిరాకరించింది. ఆ టికెట్‌ను జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుకు కేటాయించింది. ఈక్రమంలో వసంత తెలుగు దేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీలో చేరి తన సిట్టింగ్ స్థానం నుంచి టికెట్ దక్కించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అటు నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్‌కు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వసంత రాకను దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ తరుపున మైలవరం నుంచి పోటీ చేసేందుకు దేవినేని ఉమామహేశ్వరరావు సిద్ధమవుతున్నారు. కేడర్‌కు దగ్గరగా ఉంటూ.. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి జంప్ అవుతారని.. మైలవరం టికెట్ ఆయనకే దక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తుండడంతో దేవినేని ఉమ భగ్గుమంటున్నారు. వసంత కృష్ణప్రసాద్‌ రాకకు దేవినేని ఉమ మోకాలు అడ్డుపెడుతున్నారు. ఓవైపు టీడీపీలో చేరేందుకు వసంత తన సన్నిహితుల ద్వారా ప్రయత్నాలు చేస్తుంటే.. ఇటు పార్టీలో ఆయన్ను చేర్చుకోనివ్వదని ఉమ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇదే సమయంలో వసంత కృష్ణప్రసాద్ రాకను ఉద్దేశించి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరి చాలా మంది మైలవరం నుంచి పోటీకి రెడీ అవుతున్నారన్న దేవినేని ఉమ.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మైలవరం నుంచి బరిలోకి దిగేది తానేనని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గోడలు దూకి.. పార్టీలు మారి టీడీపీలోకి వస్తున్న వారిని తరిమి కొట్టాలని కేడర్‌కు దేవినేని ఉమ పిలుపునిచ్చారు. పార్టీలు మారి రాజకీయ వ్యభిచారం చేసేవారిని దూరం పెట్టాలని కోరారు.

టీడీపీలో ఉన్నవారు ఇతర పార్టీలలో చేరి వేల కోట్ల ఆస్తులు సంపాదించారన్న దేవినేని ఉమ.. మైలవరం టికెట్ కోసం వందల కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారని వ్యాఖ్యానించారు. వందల కోట్లు ఖర్చు చేసి ఎవరిని కొంటారని ప్రశ్నించారు. తాను పాతికేళ్లుగా తెలుగు దేశం పార్టీలోనే ఉంటూ.. పార్టీ విధానాల ప్రకారం నడుచుకుంటున్నానని వెల్లడించారు. కాకిలా కలకాలం బతికేకంటే హంసలా చచ్చేందుకే తాను సిద్ధమని దేవినేని వ్యాఖ్యానించారు. తాను ఎట్టిపరిస్థితిలోనైనా మైలవరం సీటు వదిలేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రజాల్లోకి కూడా వెళ్తానని దేవినేని చెప్పుకొచ్చారు. మరి ఈ పరిణామాల కృష్ణ ప్రసాద్‌ పరిస్థితి ఏంటి? చంద్రబాబు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + three =