మళ్లీ ట్రోల్ అవుతున్న వేణుస్వామి

Pawan fail in politics?, Venuswamy trolling again, Social Media, Prabhas, Rajinikanth, Jagan, Politics, Astrologer Venu Swamy,Venu Swamy About AP Politics,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,Andhra Pradesh News Updates
Pawan fail in politics?, Venuswamy trolling again, Social Media, Prabhas, Rajinikanth, Jagan, Politics

సెలబ్రెటీల జాతకాలు, జోతిష్యాలు చెబుతూ, సంచలన కామెంట్స్ చేస్తూ .. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటారు వేణుస్వామి. ఆయన చెప్పే మాటలు ఎంత కాంట్రవర్శీగా ఉంటాయో..  అదే విధంగా కొన్ని నిజాలు కూడా ఉంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో వేణుస్వామి ట్రోల్ అయినంతగా మరే జోతిష్యుడు కూడా అవలేదంటే అతి శయోక్తి కూడా కాదు. నయనతార, ప్రభాస్ వంటి సినీ సెలబ్రెటీల జాతకాలే కాదు.. ఎంతోమంది రాజకీయనేతలకు కూడా జోతిష్యం చెబుతూ వార్తలకెక్కుతూ  ఉంటారు. ఒక్కోసారి మరీ దారుణంగా  ట్రోల్ అవుతుంటారు.  అయినా అదేం  పట్టించుకోని వేణుస్వామి తన పంథానే కొనసాగిస్తూ ఉంటారు.

తాజాగా పవన్ కల్యాణ్ గురించి వేణుస్వామి చెప్పిన  విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.     పవన్ కల్యాణ్‌కు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదన్న ఆయన.. పవన్ ఎవరి మాటలు వినరని అన్నారు. తాను పవన్ కల్యాణ్ గురించి మంచి చెప్పినా కూడా పవన్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేస్తారని చెప్పారు. మంచి చెప్పినప్పుడు గ్రహించాలని.. ఎదుటివాళ్లు అది  ఎందుకు చెబుతున్నారో అర్దం చేసుకోవాలని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

అంతేకాదు పవన్ కల్యాణ్ అంటే తనకు పిచ్చి అని చెప్పుకొచ్చిన వేణుస్వామి.. ఆయన బాగుపడాలని కోరుకొనే వాళ్లలో తాను ఒకడినని అన్నారు. పవన్  నటించిన 10 సినిమాలకు తానే ముహుర్తం పెట్టినట్లు చెప్పిన వేణుస్వామి..పవన్‌తో తాను  గంటలు గంటలు గడిపిన విషయాలను గుర్తు చేసుకున్నారు. తనకు పవన్ అంటే చాలా ఇష్టమని అన్నారు. తనకు తెలిసిన ప్రతీ వ్యక్తి అభివృద్దిలోకి రావాలనేది తన  కోరిక అని అన్నారు. తనకు  శత్రువులు లేరని మిత్రులు లేరని చెప్పారు.

వైఎస్ జగన్‌ను పవన్ ఓడించి ..పవన్ కళ్యాణ్  సీఎం కావాలని కోరుకొంటానని వేణుస్వామి చెప్పారు. కానీ పవన్ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలని తాను కోరుకోనన్నారు. పవన్‌ది ముక్కుసూటి మనస్తత్వం అని సంకుచిత, కుటిల రాజకీయాలు పవన్‌కు  తెలియవని చెప్పుకొచ్చారు. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారంటూ వేణుస్వామి అన్నారు.

పవన్‌కు సినిమాల్లో తిరుగులేదన్న ఆయన.. రాజకీయాలల్లోనే కష్టమని క్లారిటీ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ లాగే పవన్ లైఫ్  ఉంటుందన్నారు. అయితే ఇప్పుడు ఈ  విషయం చెబితే పవన్ ఫ్యాన్స్  అపార్థం చేసుకొని ట్రోల్ చేస్తారు అని వేణు స్వామి అన్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై సోషల్ మీడియాలో వేణుస్వామి ట్రోల్ అవుతున్నారు. మళ్లీ మొదలెట్టేసాడు  అని కొంతమంది కామెంట్లు చేస్తే.. వాళ్లు వచ్చి నిన్ను అడిగితే జోతిష్యం జాతకాలు చెప్పు అంతేకానీ నీకు పబ్లిసిటీ రావడానికి ఇలాంటి కామెంట్లు ఎందుకని మరికొంతమంది అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 7 =