విశాఖ తూర్పు నుంచి ఎంవీవీని తప్పించే యోచనలో జగన్

MVV Satyanarayana, Visaka, YCP, CM jagan, AP Elections,Jenasena,pawan kalyan,ycp updates,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,andhra pradesh
MVV Satyanarayana, Visaka, YCP, CM jagan, AP Elections

ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ వైసీపీని వీడి.. జనసేనలో చేరిపోయారు. అప్పటి నుంచి శ్రీనివాస్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను టార్గెట్ చేశారు. తనకు ఈసారి టికెట్ దక్కకపోవడానికి.. తన రాజకీయ జీవితం నాశనం కావడానికి ఎంవీవీ సత్యనారాయణనే కారణమన్న శ్రీనివాస్.. ఎట్టిపరిస్థితుల్లోనే ఈసారి ఆయన్ను ఓడించి తీరుతానని శపధం చేస్తున్నారు.

కృష్ణ శ్రీనివాస్ బీసీలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. విశాఖ తూర్పులో 80 శాతం మంది ఓటర్లు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇప్పటికే కృష్ణ ప్రసాద్ రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ ఆయనకు టికెట్ నిరాకరించింది. ఈసారి అయినా టికెట్ దక్కుతుందని శ్రీనివాస్ ఆశించారు. కానీ హైకమాండ్ ఈసారి కూడా మొండి చేయి చూపించింది. టికెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. ఆయనను కాదని.. ఎంపీ సత్యనారాయణకు విశాఖ తూర్పు టికెట్ ఇచ్చింది.

అయితే అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ కోపంతో రగిలిపోతున్నారు. అందుకే జనసేనలో చేరిపోయారు. విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ చేసిన భూ దందాలకు సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. వాటిని బయటపెడుతానని చెబుతున్నారు. ఆయనను చివరి వరకు వెంటాడి ఓడిస్తానని అంటున్నారు. అటు విశాఖ తూర్పులో జనసేనకు కూడా బలమైన సామాజిక వర్గం కాపుల అండ ఉంది. టీడీపీ కూడా అక్కడ పటిష్టంగానే ఉంది. ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మద్ధతుతో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు సర్వేలు కూడా సత్యనారాయణ ఓటమి తప్పదని తేల్చేశాయి.

ఈక్రమంలో సత్యనారాయణను తప్పించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. ఆయన స్థానంలో టీడీపీ అభ్యర్థిని ఢీ కొట్టేందుకు బలమైన క్యాండిడేట్‌ను బరిలోకి దించాలని అనుకుంటున్నారట. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి పోటీ చేసిన ఓడిన అక్రమాని విజయ నిర్మల, విశాఖ మేయర్ హరి వెంకట కుమారి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారట. ఇప్పటికే జగన్.. విజయ నిర్మలను పిలుపించుకొని ఈ అంశంపై చర్చలు కూడా జరిపారట. చివరికి ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసి.. విశాఖ తూర్పు నుంచి బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nineteen =