ఆర్కేకు బంపర్ ఆఫర్ ఇచ్చిన వైసీపీ.. అందుకే సొంత గూటికి?

AP Politics, CM jagan, YCP, Alla ramakrishna reddy,YS Jagan,YSRCP,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Elections,Andra pradesh,AP Political updates,YCP updates,Mango News Telugu,Mango News
AP Politics, CM jagan, YCP, Alla ramakrishna reddy

ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ప్రస్తుతం ఏపీలో ఈయన గురించే పెద్ద ఎత్తున చర్చ. గతంలో మంగళగిరిలో నారా లోకేష్‌ను ఓడించి హాట్ టాపిక్‌గా మారిన ఆర్కే.. ఇప్పుడు మరోసారి ఏపీలో హాట్ టాపిక్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు జగన్ టికెట్ నిరాకరించడంతో.. గత డిసెంబర్‌లో ఆర్కే వైసీపీని వీడారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కూడా హస్తం గూటికి వెళ్లారు. కానీ ఇప్పుడు వైసీపీకి ఆర్కే లేని లోటు తెలిసొచ్చింది. దీంతో ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించింది.

ఆళ్లరామకృష్ణారెడ్డి వరుసగా రెండుసార్లు వైసీపీ తరుపున మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో నారా లోకేష్‌ను ఓడించి  సంచలనంగా మారారు. అయితే రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాక.. జగన్ కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆర్కే ఆశించారు. మొదటి విడుదలతో ఆర్కేకు జగన్ చోటివ్వలేదు. రెండో విడతలో ఇస్తారనుకున్నప్పటికీ.. అప్పుడు కూడా షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. వైఎస్సార్ కుటుంబానికి ఆర్కే అత్యంత విధేయుడు అయినప్పటికీ.. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.

ఇటు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా నిరాకరించడంతో ఆయన పార్టీ ఫిరాయించారు. వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి వెళ్లారు. అయితే ఆర్కే కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పటికీ.. వైసీపీ కేడర్ ఇంకా ఆయన వెంటే ఉందట. అంతేకాకుండా ఆళ్ల లేకుండా మంగళగిరిలో వైసీపీ గెలుపొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. మరోవైపు రెండోసారి నారా లోకేష్‌ను ఓడించి ఆయనకు రాజకీయ జీవితం లేకుండా చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈక్రమంలో ఆర్కే ఉంటేనే అధి సాధ్యమవుతుందనుకున్న జగన్.. వెంటనే విజయసాయిరెడ్డి ద్వారా ఆర్కేకు ఆహ్వానం పంపించారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఆర్కేతో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత జగన్‌ను ఆర్కే కలిశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీని చేసి అయినా కేబినెట్‌లో చోటు కల్పిస్తామని జగన్.. ఆళ్లకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. అటు కాంగ్రెస్‌లో ఉంటే గెలిచే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇటు తిరిగి వైసీపీలోకి వెళ్తే మంత్రి కావాలన్న తన కోరిక నెరవేరుతుందని.. తిరిగి సొంతగూటికి వెళ్లారట ఆళ్ల రామకృష్ణారెడ్డి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 13 =