నారా లోకేష్‌తో భేటీ అయిన వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె.. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుంచి పోటీకి హామీ?

YCP MLA Anam Daughter Kaivalya Reddy Meets Nara Lokesh at Ongole Ready To Join TDP, MLA Anam Daughter Kaivalya Reddy Meets Nara Lokesh at Ongole Ready To Join TDP, Anam Daughter Kaivalya Reddy Meets Nara Lokesh at Ongole, YCP MLA Anam Daughter Kaivalya Reddy Meets Nara Lokesh at Ongole, YCP MLA Anam Daughter Kaivalya Reddy Ready To Join TDP, Kaivalya Reddy Ready To Join TDP, YCP MLA Anam Daughter Kaivalya Reddy, MLA Anam Daughter Kaivalya Reddy, Anam Daughter Kaivalya Reddy, Kaivalya Reddy, MLA Anam Ramanarayana Reddy, YCP MLA Anam Ramanarayana Reddy Daughter Kaivalya Reddy, YCP MLA Anam Ramanarayana Reddy Daughter Kaivalya Reddy is reportedly preparing to join the Telugu Desam Party, Telugu Desam Party, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా అప్పుడే రాజకీయ వేడి రగులుతోంది. ఒంగోలులో జరుగుతున్న మహానాడు వేదికగా దీనికి సంబంధించిన పరిణామాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మహానాడు వద్ద ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. నెల్లూరు జిల్లా వైసీపీ ముఖ్య నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె.. కైవల్యా రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాతో పాటు అధికార వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈరోజు నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన కైవల్య, నేరుగా మహానాడు ప్రాంగణానికి చేరుకొని, అక్కడ లోకేష్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

జిల్లాకు సంబంధించిన అంశాలతో పాటు కొన్ని ఇతర కీలక అంశాలు చర్చించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేయాలని కైవల్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం కావడం విశేషం. ఈ మేరకు ఆమె ఈ భేటీలో లోకేష్‌కు ఆ విషయం తెలిపి ఆయన నుంచి హామీ పొందినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం వైసీపీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తన కుమార్తెను రాజకీయాలలో ప్రోత్సహించటానికి ఆయన అంగీకరించారని తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =