ఇండియా: మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ కిట్‌ను రూపొందించిన ట్రివిట్రాన్ కంపెనీ

India Private Company Trivitron Develops Special RT PCR Kit For The Detection of Monkeypox Virus, Private Company Trivitron Develops Special RT PCR Kit For The Detection of Monkeypox Virus, Trivitron Develops Special RT PCR Kit For The Detection of Monkeypox Virus, RT PCR Kit For The Detection of Monkeypox Virus, Monkeypox Virus, India Private Company Trivitron, Private Company Trivitron, RT PCR Kit For Monkeypox Virus, RT PCR Kit, Monkeypox, The Research and Development team of Trivitron Healthcare, Trivitron Healthcare, RT-PCR based kit for the detection of Monkeypox virus, Monkeypox virus News, Monkeypox virus Latest News, Monkeypox virus Latest Updates, Monkeypox virus Live Updates, Mango News, Mango News Telugu,

మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించడం కోసం రియల్ టైమ్ పిసిఆర్ ఆధారిత కిట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రముఖ వైద్య పరికరాల కంపెనీ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్” శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం పరిశోధకులు ఎపిడెమియాలజీ, వ్యాధి వ్యాప్తి మూలాలు మరియు వైరస్ ప్రసార విధానాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు మే 13న నమోదయ్యాయి. ఇప్పటివరకు 20 దేశాలలో సుమారు 200 వరకు ఈ కేసులు నమోదయ్యాయని, ఈ అంటువ్యాధిపై నిఘా పెంచాలని అన్ని దేశాలను కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). మంకీపాక్స్ కి సంబంధించి ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న డబ్ల్యూహెచ్ఓ.. అసాధారణ లైంగిక చర్యలు కూడా వైరస్ వ్యాప్తికి కారణమై ఉండొచ్చని ఒక అంచనా వేస్తోంది.

ఇప్పటివరకు మంకీపాక్స్ సోకినవారిలో.. అత్యధికులు స్వలింగ సంపర్కులు, బయో సెక్సువల్స్, గేలు ఉన్నట్లు బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల వైద్యులు సైతం ప్రకటించారు. ఇది పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలోని దేశాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వేగంగా వ్యాపిస్తోంది.  “కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచానికి సహాయం చేయడంలో భారతదేశం ఎల్లప్పుడూ ముందంజలో ఉంది. ప్రస్తుత పరిస్థితిలో కూడా ప్రపంచానికి మరోసారి సహాయం కావాలి. ఈ వైరల్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మేము భావిస్తున్నాం” అని ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్ర గంజూ అన్నారు.

ట్రివిట్రాన్ అభివృద్ధి చేసిన మంకీపాక్స్ రియల్-టైమ్ పీసీఆర్ కిట్ అనేది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్-ఆధారిత కిట్ అని, ఇది ఒక ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్‌లో స్మాల్‌పాక్స్ మరియు మంకీపాక్స్ మధ్య తేడాను గుర్తించగలదని ఆయన తెలిపారు. మొత్తం టర్న్ రౌండ్ సమయం ఒక గంట అని, ఈ నాలుగు జన్యు ఆర్టీపీసీఆర్ కిట్‌లలో, మొదటి లక్ష్యం విస్తృత ఆర్థోపాక్స్ సమూహంలోని వైరస్‌లను గుర్తిస్తుందని, రెండవ మరియు మూడవ లక్ష్యాలు వరుసగా మంకీపాక్స్ మరియు స్మాల్ పాక్స్ వైరస్‌లను గుర్తించి వేరు చేస్తాయని తెలియజేశారు. ఇక నాల్గవ లక్ష్యం మానవ కణానికి సంబంధించిన అంతర్గత నియంత్రణ పరీక్షను పరిష్కరించడానికి కనుగొంటుందని అన్నారు. ఈ కిట్ ద్వారా వ్యాధి వ్యాప్తిని సులువుగా అడ్డుకోవచ్చని చంద్ర సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eleven =