కేంద్రం కీలక నిర్ణయం, కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్, ప్రికాషన్ డోస్ మధ్య వ్యవధి 6 నెలలకు తగ్గింపు

Gap Between Covid-19 Second Dose and Precaution Dose Reduced to 6 Months - Union Health Ministry, Union Health Ministry Says Gap Between Covid-19 Second Dose and Precaution Dose Reduced to 6 Months, Gap Between Covid-19 Second Dose and Precaution Dose Reduced to 6 Months, Gap Between Covid-19 Second Dose and Precaution Dose Reduced, Covid-19 Second Dose, Covid-19 Precaution Dose, Union Health Ministry, Covid Vaccination in India, Wuhan Virus Vaccination, Wuhan Virus, India COVID-19 Vaccination, Corona Vaccination Programme, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, COVID-19 Vaccination Dose, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Mango News Telugu,

దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్‌ తీసుకునేందుకు ప్రస్తుతమున్న 9 నెలలు/39 వారాల వ్యవధిని 6 నెలలు/26 వారాలకు తగ్గిస్తునట్టుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటన చేసింది. దీంతో ఇకపై 18 ఏళ్లు పైబడిన వారంతా రెండవ డోస్ తీసుకుని 6 నెలల పూర్తయిన వెంటనే ప్రికాషన్ డోస్‌ తీసుకునే అవకాశం కలిగింది.

పరిణామం చెందుతున్న శాస్త్రీయ ఆధారాలు మరియు గ్లోబల్ ప్రాక్టీసెస్ దృష్ట్యా, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ యొక్క స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ రెండవ డోస్ మరియు ప్రికాషన్ డోస్‌ మధ్య వ్యవధిని ఇప్పటికే ఉన్న 9 నెలలు నుండి 6 నెలలు సవరించాలని సిఫార్సు చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా రెండవ డోస్ తీసుకుని 6 నెలల పూర్తయిన హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ మరియు 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా ప్రికాషన్ డోస్ ఉచితంగా అందించనున్నారు. అలాగే రెండవ డోస్ తీసుకుని 6 నెలల పూర్తయిన 18-59 సంవత్సరాల వారికీ ప్రికాషన్ డోస్ ను ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అందించనున్నారు. ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించడంపై కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here