ప్రొఫషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ కే నా ప్రయారిటీ – ప్రముఖ గాయని సునీత

I Will Give More Priority to My Personal Life Than Professional Life, Mango News, Mango News Telugu, Singer Sunitha, Singer Sunitha About Personal Life, Singer Sunitha About Professional Life, Sunitha, sunitha husband, Sunitha Marriage Life, Sunitha Ram, Sunitha Upadrashta, Sunitha Upadrashta Interview, Sunitha Upadrashta Latest Interview, Sunitha’s memorable moments

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ గాయని సునీతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన మృదు మధుర గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆవిడ. తెలుగు చిత్ర పరిశ్రమలో మరే సింగర్‌కు లేనటువంటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సింగ‌ర్‌ సునీతకు ఉంది. ఇటీవలే రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తని ద్వితీయ వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి ఎంటరైన సునీత కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే, ఒకవైపు ప్రొఫషనల్ లైఫ్‌ను, ఇంకోవైపు పర్సనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత పలు విషయాలను పంచుకున్నారు.

“నాకు జీవితంపై క్లారిటీ ఉంది. నా జీవితం నాకు నచ్చినట్లుగా.. గౌరవంగా బ్రతకాలనుకుంటాను. ఇప్పుడు అలాగే బ్రతుకుతున్నాను. పెళ్లి తర్వాత నా మ్యారెజ్‌ లైఫ్‌ ఎలా ఉందో అన్నది.. నన్ను చూస్తేనే మీకు అర్ధం అవుతుంది. సంతోషంగా ఉన్నాను అన్నది నా ముఖంలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మా వారు, నేను ఇద్దరం ఇంచుమించు ఒకే రంగంలో ఉన్నాం. భార్యగా నా భర్తకు ఎప్పుడైనా సాయం కావాల్సి వస్తే తప్పకుండా పక్కన ఉంటాను. అయితే, ప్రొఫెషనల్‌ లైఫ్‌ కంటే పర్సనల్‌ లైఫ్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తాను, అది నాకెంతో ఇష్టం” అని సునీత తన మనసులోని భావాలను పంచుకున్నారు.

అలాగే, ఈ సంవత్సరంలో జరిగిన విషాదాలపై స్పందిస్తూ ఇలా అన్నారు.. “2021లో ఎంతోమందిని పోగొట్టుకున్నాను. ముఖ్యంగా.. ఎస్పీ బాలు గారిని కోల్పోవటం పర్సనల్ గా నాకు అతి పెద్ద షాక్. ఆ విషాదం తర్వాత నాకు కన్నీళ్లు రావడం ఆగిపోయాయి. ఏదైనా అనుకోనిది జరిగినా.. కొద్దిసేపు మైండ్ బ్లాంక్‌ అయినట్లు అనిపిస్తుంది.. అంతే కానీ, అంతకు మించిన భావోద్వేగం నాకేమీ కలగటం లేదు. బాలు గారు లేని లోటు తీర్చలేనిది” అంటూ ఎమోషనల్‌ అయ్యారు. గాన గంధర్వుడు, ప్రముఖ నేపథ్య గాయకుడు అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన “పాడుతా తీయగా” కార్యక్రమంలో పాల్గొన్నప్పటినుంచీ సునీతకు, ఆయనతో పరిచయం ఉంది. తనకు సింగింగ్ విషయంలో గైడ్, ఫిలాసఫర్.. అన్నీ బాలు గారే అని ఎన్నో సందర్భాలలో ఆవిడ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 9 =