అదానీ వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీం ప్రతిపాదనకు అంగీకారం, మదుపరుల కోసం రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుకు సిద్ధం

Adani-Hindenburg row Centre Agrees For SC Proposal To Strengthen Regulatory Regime For The Protection of Investors,Against short-seller Hindenburg Amid Severe Allegations,Modi Strong Counter Adani Issue,Mango News,Mango News Telugu,Adani Group Companies,Adani Gas Share Price,Adani Career,Adani Cement,Adani Electricity,Adani Electricity Bill,Adani Electricity Bill Payment,Adani Enterprises,Adani Enterprises Share Price,Adani Gas,Adani Green Share Price,Adani One,Adani Port Share Price,Adani Power,Adani Power Share Price,Adani Wilmar Share Price,Gautam Adani,Gautam Adani Net Worth

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెల్లడించిన సంచలన విషయాలు అనంతరం ప్రధాన మార్కెట్ ఒడిదుడుకుల నుండి పెట్టుబడిదారులను రక్షించడానికి అవసరమైన అదనపు చర్యలను రూపొందించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు సూచనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో దీనిపై విచారణ సందర్భంగా, పెట్టుబడిదారులను భారీ నష్టాల నుంచి రక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు తన ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వం అమలులో ఉన్న రెగ్యులేటరీ పాలనను అణగదొక్కకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది.

కాగా అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదికపై దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి 10న మోసం ఆరోపణల నేపథ్యంలో షేర్ల పతనాన్ని పరిశీలించడానికి ప్రభుత్వానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించిన విషయం తెలిసిందే. దీనిపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో సీనియర్ న్యాయమూర్తులు పిఎస్ నరసింహ మరియు జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక సుప్రీం సూచనకు ప్రతిస్పందనగా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. అటువంటి పరిస్థితులను పరిష్కరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరియు ఇతర ఏజెన్సీలు పూర్తిగా సన్నద్ధమయ్యాయని నమ్ముతున్నప్పటికీ, ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకం కాదని, ఎటువంటి అభ్యంతరం కూడా లేదని కోర్టుకు తెలిపారు. దీనికి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం నాటికి కమిటీ ప్రతిపాదిత చెల్లింపుపై గమనికను అందించాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =