సంచలన వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు

Allahabad High Court sensational comments on marriages,Allahabad High Court sensational comments,sensational comments on marriages,High Court sensational comments,Mango News,Mango News Telugu,Allahabad High Court sensational comments on marriages,Hindu marriage invalid without Saptapadi,Not Valid Without Saat Pheras,Allahabad High Court Latest News,Allahabad High Court Latest Updates,Allahabad High Court Live News,Allahabad High Court News,High Court on marriages Latest News,High Court on marriages Latest Updates
Allahabad High Court sensational comments on marriages,Allahabad High Court sensational comments,sensational comments on marriages,High Court sensational comments,Mango News,Mango News Telugu,Allahabad High Court sensational comments on marriages,Hindu marriage invalid without Saptapadi,Not Valid Without Saat Pheras,Allahabad High Court Latest News,Allahabad High Court Latest Updates,Allahabad High Court Live News,Allahabad High Court News,High Court on marriages Latest News,High Court on marriages Latest Updates

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఓ మధురఘట్టం. ఓ అందమైన క్షణం. ఈ అద్భుత ఘట్టాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, జీవనశైలిని బట్టి.. వారి వారి సంప్రదాయాల్లో జరుపుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విధాలుగా పెళ్లి చేసుకుంటున్నప్పటికీ.. హిందూ వివాహాలకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. పెళ్లి చూపుల నుంచి తాళికట్టే వరకు ప్రతీది ప్రత్యేకమే. ప్రతి ఒక్క దానిలో ఒక అర్థం ఉంటుంది. అందుకే చాలా మంది హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి కనబర్చుతుంటారు. ఇతర దేశాల నుంచి కూడా ఇండియాకు వచ్చి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటూ ఉంటారు.

అయితే వివాహాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపై ఆచారాలు, సంప్రదాయాలు పాటించకుండా.. తూతూమంత్రంగా పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. ఆచారాలు, సంప్రదాయాలను పాటించకుండా జరిగే పెళ్లిళ్లు చెల్లవని సంచలన తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకోకుండా తన భార్య రెండో వివాహం చేసుకుందని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

సత్యసింగ్ అనే వ్యక్తికి 2017లో స్మృతి సింగ్‌తో వివాహం జరిగింది. కొన్ని రోజుల పాటు వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సత్యసింగ్ తల్లిదండ్రులు పలుమార్లు అదనపు కట్నం కోసం స్మృతి సింగ్‌ను వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలో స్మృతి సింగ్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా కూడా వేధింపులు ఎక్కువైపోవడంతో స్మృతి సింగ్ భర్తకు దూరంగా వెళ్లిపోయింది. సత్యసింగ్ తన ఇంటికి రావాలని పలుమార్లు కోరినా కూడా స్మృతి సింగ్ రాలేదు. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

ఈక్రమంలో సత్యసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య విడాకులు తీసుకోకుండానే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని సత్యసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం వారి పెళ్లిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. పెళ్లి అనే పదానికి సరైన ఆచారాలతో.. సంప్రదాయాలతో.. కట్టుబాట్లలో వివాహాన్ని జరుపుకోవడం అని అర్థం వస్తుందని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ అన్నారు.

ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం జరగకపోతే దానిని పెళ్లి అనలేమని తేల్చి చెప్పారు. హిందూ చట్టం ప్రకారం సప్తపది వేడుక పెళ్లిని చెల్లుబాటుగా గుర్తించేందుకు అవసరమైన వాటిల్లో ఒకటిగా పేర్కొన్నారు. కానీ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి విషయానికి సంబంధించిన పెళ్లిలో అటువంటి వేడుక ఏమీ జరగలేదని అన్నారు. అందువల్ల ఆ పెళ్లి చెల్లుబాటు కాదని అన్నారు. పెళ్లి అనేది చెల్లుబాటు అయ్యే వివాహం కాకపోతే చట్టం ప్రకారం అది వివాహం కిందకు రాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆ పెళ్లిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =