రావణుడు వెర్సస్ అదానీ పప్పెట్

The Poster War between Congress and BJP,The Poster War,War between Congress and BJP,Congress and BJP,Mango News,Mango News Telugu,BJP vs Congress poster war escalates,The political poster battle,PM Modi depicted as Adani puppet,Respondents react to poster war,Poster War Erupts Between Congress,Congress declare poster war,Congress and BJP Latest News,Congress and BJP Latest Updates,Congress and BJP Live News

కాంగ్రెస్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీ నడుమ ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా కొద్దిరోజులుగా పోస్టర్‌ వార్‌ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రావణుడితో పోలుస్తూ.. బీజేపీ విడుదల చేసిన పోస్టర్ తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది.రాహుల్ గాంధీని రావణుడితో పోల్చడంతో.. దీనికి ప్రతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో మోడీని వ్యాపారవేత్త అదానీ పప్పెట్‌గా బొమ్మ ద్వారా చెప్పుకొచ్చింది.

దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా.. పోస్టర్ వార్ మరింత ముదురుతున్నట్లే కనిపిస్తోంది.
అక్టోబర్ 4న ప్రధాని మోడీని.. జుమ్లాబాయ్‌, అతిపెద్ద అబద్ధాల కోరుగా అభివర్ణిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ముందుగా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో వ్యంగ్య పోస్టర్లు పెట్టింది. ‘పీఎం నరేంద్ర మోదీ యాజ్‌.. జుమ్లా బాయ్‌” అంటూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో ప్రధాని మోడీతోపాటు అమిత్‌షా ఫొటోనూ పెట్టింది.

దీనికి 24 గంటలు కూడా తిరక్కముందే రాహుల్‌ను రావణుడిగా పోలుస్తూ.. బీజేపీ కాంగ్రెస్‌కు దీటుగా సమాధానమిచ్చింది. రాహుల్‌కి పది తలలు అతికించిన ఒక పోస్టర్‌ను బీజేపీ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ కాలపు రావణుడు. ఆయనే భూతం, ధర్మ వ్యతిరేకి, రాముడి వ్యతిరేకి, భారత్‌ను ధ్వంసం చేయడమే ఆయన ధ్యేయం” అంటూ బీజేపీ రాసుకొచ్చింది.అంతేకాదు దానికింద’రావణ్‌..జార్జ్‌ సోరోస్‌ దర్శకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రొడక్షన్‌” అని రాసి ఉండటంతో.. కాంగ్రెస్ నేతలు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

జార్జ్‌ సోరోస్‌.. హంగరీ సంతతికి చెందిన అమెరికన్‌ బిజినెస్ మ్యాన్, అపరకుబేరుడు.మోడీపై తరచూ విమర్శలు చేస్తుంటారు. దీంతో.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై సోరోస్‌ దాడి చేస్తున్నారని బీజేపీ తరచూ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటుంది. ఇప్పుడు సోరో‌స్‌కు, రాహుల్‌ గాంధీకి లింక్ పెడుతూ పోస్టర్‌ను ట్వీట్‌ చేయడంపై కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు.

దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ప్రధాని మోడీపై అదానీ పప్పెట్ అనే అర్థంలో పోస్టర్ విడుదల చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. తోలుబొమ్మలాటకు స్పూఫ్‌గా అదానీ అని రాసున్న అక్షరాల్లోంచి వచ్చిన దారాలతో మోడీ పని చేస్తున్నట్టుగా రూపొందించారు. అంటే మోడీ ప్రభుత్వం అదానీ కనుసన్నల్లోనే ఉందని, అదానీ చెప్పినట్లుగానే నడుస్తుందని అర్థం వచ్చేలా దాన్ని రూపొందించారు.దీంతో ఇకనైనా ఇది ఆగుతుందా లేక ఇంకా ఇలాగే కంటెన్యూ అవుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తుందా అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 6 =