చైనా సెల్ ఫోన్ దిగ్గజ కంపెనీ ‘షియోమీ టెక్నాల‌జీ’కి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

ED Seizes Chinese Smartphone Giant Xiaomi's Bank Accounts Worth Rs 5551 Cr Over Forex Violations, Enforcement Directorate seized over Rs 5551 crore worth fund of Chinese mobile manufacturing company Xiaomi, Chinese mobile manufacturing company Xiaomi, Chinese mobile manufacturing company Xiaomi violating the Indian foreign exchange law, Indian foreign exchange law, ED seizes Rs 5551 crore deposits of Chinese mobile manufacturing company Xiaomi, Enforcement Directorate, FEMA violation, Xiaomis Rs 5551 Crore Assets Seized Over violating the Indian foreign exchange law, ED Seizes Xiaomis Rs 5551 Crore Assets, 5551 Crore Assets, Forex Violations, Chinese Smartphone Giant Xiaomi's Bank Accounts, Xiaomi, FEMA violation News, FEMA violation Latest News, FEMA violation Latest Updates, Mango News, Mango News Telugu,

భారతీయ విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ నుంచి రూ.5,551 కోట్ల ఆస్తులు సీజ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. 1999 ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనల ప్రకారం చైనా ఆధారిత షియోమీ గ్రూప్ యొక్క యాజమాన్యంలోని అనుబంధ సంస్థ షియోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ₹5,551.27 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ శనివారం తెలిపింది. సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలలోని ఈ నగదు ‘చట్టవిరుద్ధమైన చెల్లింపులకు’ సంబంధించి సీజ్ చేయబడిందని ఈడీ పేర్కొంది. అక్రమంగా బయటికి పంపిన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.

అయితే షియోమీ ఇండియా అనేది చైనాకు చెందిన షియోమీ గ్రూప్‌ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. MI బ్రాండ్ పేరుతో దేశంలో మొబైల్ ఫోన్‌లను విక్రయిస్తోంది. కంపెనీ బ్యాంక్ ఖాతాలలో ఉన్న ఈ మొత్తం ₹5,551.27 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఖాతాలనుంచి మూడు విదేశీ ఆధారిత సంస్థలకు ₹5,551.27 కోట్లకు సమానమైన విదేశీ కరెన్సీని రాయల్టీ ముసుగులో పంపించిందని, ఇది ఫెమాలోని సెక్షన్ 4ను ఉల్లంఘిస్తుందని ఈడీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ చేసిన అక్రమ చెల్లింపులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఏప్రిల్ ప్రారంభంలో, దర్యాప్తులో భాగంగా షియోమి కార్ప్ మాజీ భారత అధిపతిని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించినట్లు తెలిసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 4 =