చారిత్రక విజయంతో టీమిండియాకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ

2-1 against Australia, 5 CR Bonus for the Team India after Remarkable Win, AUS vs IND, bcci, BCCI Announced 5 CR Bonus, BCCI Announced 5 CR Bonus For Team India, Brisbane Test, Highlights India vs Australia Match, IND vs AUS 4th Test highlights, IND vs AUS 4th Test Results, India breaches Australia’s Brisbane fortress, India clinch Australia Test series, India vs Australia, India vs Australia Match, India Wins Test Series, India Wins Test Series with 2-1 against Australia, Mango News

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ ను 2-1 తో గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక విజయం నేపథ్యంలో జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది. “ఇది ఒక గొప్ప విజయం. ఆస్ట్రేలియా వెళ్లి ఈ విధంగా ఒక టెస్ట్ సిరీస్ గెలవడం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జట్టుకు బీసీసీఐ 5 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. ఈ గెలుపు విలువ ఏ సంఖ్యాకైనా మించిందే. ఆస్ట్రేలియా టూర్ లో పాల్గొన్న ప్రతి సభ్యునికి అభినందనలు” అని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.

మరోవైపు ఈ టెస్ట్ సిరీస్ విజయంతో భారత జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండవ స్థానికి చేరుకుంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడోస్థానానికి వెళ్ళింది. అలాగే ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌లో 430 పాయింట్లుతో భారత్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌ తర్వాత న్యూజిలాండ్‌ 420, ఆస్ట్రేలియా 332 పాయింట్స్ తో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

 

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 15 =