బెంగళూరులో ప్రధాని మోదీని కలిసిన పలువురు కర్ణాటక సినీ, క్రీడా ప్రముఖులు

Several Kannada Film Stars and Sportspersons Meets PM Narendra Modi in Bengaluru,PM Modi Meets Kannada Actors,Mango News,National Politics News,National Politics And International Politics,National Politics Article,Mango News Telugu,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరో ఇండియా 2023 కోసం బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నగరంలో ఉన్నప్పుడు పలువురు ప్రముఖులు బెంగళూరులో కలుసుకున్నారు. వీరిలో ‘కేజీఎఫ్’ సినిమా ఫేమ్ యష్ మరియు ‘కాంతారా’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. పరిశ్రమకు ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు ఈ ఇద్దరు స్టార్‌లను ప్రధాని మోదీ అభినందించారు. అలాగే ఈ సందర్భంగా తన పని ద్వారా భారతదేశ సంస్కృతికి మరియు గుర్తింపుకు కన్నడ చలనచిత్ర పరిశ్రమ గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చిందని సినీ తారలతో అన్నారు.

కాగా బీజేపీ కర్ణాటక అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ప్రకారం, ప్రధాని మోదీ సంస్కృతి, నవ భారతం మరియు కర్ణాటక రాష్ట్రం గురించి స్టార్‌లతో చర్చించారు. ఇంకా సినిమాలకు సంబంధించిన కోర్సులను అందించడానికి మా ఐటీఐలను ఉపయోగించుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడారు’ అని పేర్కొన్నారు. ఇక కన్నడ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్‌ కూడా ప్రధానిని కలిశారు. బెంగళూరులోని ఒక రహదారికి డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ రోడ్డు అని పేరు పెట్టినందుకు కర్ణాటక ప్రభుత్వానికి గత వారమే అశ్విని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలువురు మాజీ భారత క్రికెటర్లు ప్రధాని మోదీని కలిశారు. వీరిలో మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, మాజీ ఆటగాళ్లు జవగళ్ శ్రీనాథ్ మరియు వెంకటేష్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =