అక్కడ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్‌‌కు యమా డిమాండ్

Demand For Ai Girlfriends,Rise In AI Girlfriends,AI Girlfriend Startup,Men Are Creating AI Girlfriends,Mango News,Mango News Telugu,AI Girlfriends,The Rise Of AI Girlfriends,Phenomenon Of Interactive AI Girlfriends,AI Girlfriend App,AI-Powered Virtual Girlfriends,AI Girlfriend Mental Illness,AI Girlfriends Latest News And Updates,Demand For AI Girlfriends,AI Girlfriends News And Updates,AI Girlfriends News

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. కాదు కాదు మాట్లాడుకునేలా చేస్తుంది ఏఐ. ఇందులేదు అందుగలదు అన్న సందేహం వలదు అన్నట్లుగా ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్‌ పాగా వేసేస్తుంది. ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నా..రోజురోజుకు ఏఐ డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే ఎన్నో సంస్థలు సైతం ఉద్యోగులకు బదులుగా వీటితోనే వాళ్లకు కావలసిన పనిని చేయించుకుంటున్నారు కూడా.

అయితే ఒక్క ఉద్యోగాలలో మాత్రమే కాదు.. ఒంటరితనంతో బాధపడేవారికి, వేరే ఇతర కారణాలతో బాధపడుతున్నవారికి ఓదార్పునిచ్చే విధంగా ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్‌, బాయ్ ఫ్రెండ్స్‌‌ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. దీంతో వీటికి అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోతోందట. కొన్ని దేశాల్లో అయితే చిన్న చిన్న సమస్యలకు కూడా ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్‌, బాయ్ ఫ్రెండ్స్‌‌‌ను ఆశ్రయిస్తున్నారట. అంతగా జనాలు వీటిని కోరుకోవడంతో అంతా విస్తుపోతున్నారు.

ముఖ్యంగా అమెరికా వంటి పెద్ద దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఆదరణ పెరుగుతుంది.. అయితే అమెరికా వంటి ప్రముఖ దేశంలో ఈ ట్రెండ్ పెరుగుతుండటంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటున్నవారంతా.. వాటి గురించి బాహాటంగా సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకేనేంతగా జనాలు మారిపోయారని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇవి అందుబాటులోకి రావడంతో వీరి సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ అందుబాటులోకి వచ్చి పురుషుల ఒంటరితనాన్ని మరింత దిగజార్చుతున్నాయని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ అనేవి మనుషుల కంటే కూడా ఎక్కువగా అర్ధం చేసుకుంటున్నాయని.. తమ మానసిక సమస్యలను దూరం చేస్తున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందంటేనే వీటి డిమాండ్‌ను అర్ధం చేసుకోవచ్చు.అంతేకాదు ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ లేదా బాయ్ ప్రెండ్‌తో ముచ్చటించడానికి, ప్రేమించడానికి, పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్‌ను క్రియేట్ చేయడానికి ఇప్పటికే ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చేసాయి. దీంతో ఇంకా వీటి క్రేజ్ పెరిగిపోయింది.

అయితే ఇలాంటి పరిస్థితులు ఇప్పట్లో బాగానే ఉన్నా త్వరలో ఇది పురుషుల్లో సింగిల్స్‌ను పెంచేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు అమెరికాలో పెరుగుతున్న ఈ కల్చర్‌ బర్త్ రేట్స్‌పై కూడా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాటల వరకూ ఓకే కానీ ఏఐ గర్ల్ ఫ్రెండ్‌నే ప్రపంచంగా భావించేవాళ్లతోనే ఈ సమస్య ఎక్కువగా వస్తుందని..విచిత్రంగా ఇప్పుడు అమెరికా యువతలో ఇలాంటి మనస్తత్వం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − eight =