స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీజీసీఏ.. వరుస ఘటనలపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశం

DGCA Issues Show Cause Notice To SpiceJet After 8 Safety-Related Malfunction Incidents in 18 Days, Directorate General of Civil Aviation Issues Show Cause Notice To SpiceJet After 8 Safety-Related Malfunction Incidents in 18 Days, 8 Safety-Related Malfunction Incidents in 18 Days, DGCA Issues Show Cause Notice To SpiceJet, Show Cause Notice To SpiceJet, SpiceJet Show Cause Notice, Show Cause Notice, SpiceJet, Directorate General of Civil Aviation, 8 Safety-Related Malfunction Incidents, Show Cause Notice To SpiceJet News, Show Cause Notice To SpiceJet Latest News, Show Cause Notice To SpiceJet Latest Updates, Show Cause Notice To SpiceJet Live Updates, Mango News, Mango News Telugu,

పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం డీజీసీఏ స్పైస్‌జెట్‌ సంస్థకు బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇటీవలి వరుస ఘటనల నేపథ్యంలో విమానాల భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు విషయంలో సరైన వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. ప్రయాణీకులకు సుర‌క్షిత‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన‌ వైమానిక సేవ‌ల్ని క‌ల్పించ‌డంలో స్పైస్‌జెట్ సంస్థ విఫ‌ల‌మైన‌ట్లు ఏవీయేష‌న్ రెగ్యూలేట‌రీ సంస్థ డీజీసీఏ అభిప్రాయ‌ప‌డింది. గడచిన 18 రోజుల్లో 8 సార్లు ఆ సంస్థకు చెందిన విమానాలలో సాంకేతిక సమస్యలు వెలుగు చూడటంపై డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. నిన్న దుబాయ్ వెళ్తున్న విమానాన్ని ఫ్యూయల్ ఇండికేటర్ సమస్యతో కరాచీలో ల్యాండ్ చేసిన విష‌యం తెలిసిందే.

అంతకుముందు బుధవారం చైనా వెళ్లాల్సిన కార్గో విమానాన్ని స్పైస్‌జెట్ దారి మ‌ళ్లించిన‌ట్లు డీజీసీఏ దృష్టికి వచ్చింది. వెద‌ర్ రాడార్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో అత్యవసరంగా ఆ విమానాన్ని కోల్‌క‌తాలో ల్యాండ్ చేశారు. జూన్ 19వ తేదీన పాట్నా నుంచి 185 మంది ప్ర‌యాణికుల‌తో బ‌య‌లుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని ప‌క్షి ఢీ కొట్ట‌డంతో ఇంజిన్ దెబ్బ‌తిన్న‌ కారణంగా అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశారు. అదే రోజు జ‌బ‌ల్‌పూర్‌-ఢిల్లీ విమానంలోనూ స‌మ‌స్య ఏర్పడింది. అలాగే గ‌త నెల 24, 25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్‌లేజ్ డోర్ వార్నింగ్ సమస్య త‌లెత్తింది. దీంతో ఆ రెండు విమాన స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. ఇక ఇదే క్రమంలో ఈ నెల రెండో తేదీన జ‌బ‌ల్‌పూర్‌-ఢిల్లీ విమానం క్యాబిన్‌లో పొగ‌లు రావడంతో ప్రయాణికులు భీతిల్లడం తెలింసిందే. ఈ వరుస పరిణామాలపై డీజీసీఏ అసహనం వ్యక్తం చేసింది. ప్రయాణికుల భద్రతే మన ప్రైమ్ మోటో అని స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here