మీ ఆధార్‌ నెంబర్‌‌కు ఏ ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయిందో గుర్తు లేదా?

Dont Remember Which Phone Number Is Linked To Your Aadhaar Number, Which Phone Number Is Linked To Your Aadhaar Number, Phone Number Is Linked To Aadhaar, Aadhaar Linked To Phone Number, UIDAI,MAadhaar,Basis For Aadhaar Card, Phone Number Is Linked To Aadhaar Number,Aadhaar Number, Latest Phone Number Linked To Aadhaar News, Phone Number Linked To Aadhaar News Update, Aadhaar, Latest Technical News, Technology, Mango News, Mango News
UIDAI,mAadhaar ,Basis for Aadhaar card, phone number is linked to Aadhaar number,Aadhaar number

ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఆధార్‌ కార్డు వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి.. చిన్న సిమ్‌ కార్డ్‌ తీసుకోవాలన్నా కూడా ప్రతీ దానికి  ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే అంటున్నారు.  అయితే ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవాలన్నా.. ఎక్కడైనా ఆధార్ కార్డును వాడాలన్నా కూడా దానితో లింక్ అయ్యే మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఆధార్ సంబంధిత సేవలు ఏమైనా సరే పొందగలరు. లేదంటే ఆధార్ పనికి రాదు. కానీ చాలామంది ఆధార్‌ కార్డ్‌‌కు ఏ ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయిందో అన్న విషయాన్ని మర్చిపోతారు.ఇప్పుడు ఇలాంటివారందరి కోసం ఆధార్‌ కార్డ్‌కు ఏ ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయ్యిందనే విషయాన్ని తెలుసుకోవడానికి యూఐడీఏఐ  కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.

ఆధార్‌ లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌ను తెలుసుకోవడానికి ముందుగా యుఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎమ్ ఆధార్ యాప్‌లోకి వెళ్లాలి. తర్వాత వెరిఫై మొబైల్‌ మీద క్లిక్‌ చేయాలి. దీంతో ఆధార్‌ నంబర్‌ ఏ మొబైల్ నంబర్‌కు  లింక్ అయిందో  లేదా  ఏ ఈమెయిల్‌ ఐడీతో లింక్ అయివుందో తెలుస్తుంది. దీని ద్వారా మీకు సంబంధం లేని  వేరే ఇతర నెంబర్‌తో ఆధార్‌ అనుసంధానమై ఉంటే దానిని ఈజీగా గుర్తించొచ్చు. ఒకవేళ వేరే నంబర్ ఉంటే కనుక ఆ నెంబర్‌ తీసేసి, మీ నెంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

అంతేకాదు ఆధార్‌ కార్డ్‌ ఎన్‌రోల్‌ చేసుకునే సమయంలో.. ఏ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చారో తెలియకపోయినా కూడా ఈ వెబ్ సైట్‌లో చూడొచ్చు. ఎమ్ ఆధార్  యాప్‌ లేదా యుఐడీఏఐ వెబ్‌సైట్‌లో.. వెరిఫై ఆధార్‌ ఆప్షన్‌కి వెళ్లాలి. తర్వాత ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేయాలి. దీంతో  మీరు ఏ మొబైల్‌ నెంబర్‌ ఇచ్చారో, మొత్తం నెంబర్ కాకుండా.. ఆ నెంబర్‌లోని చివరి మూడు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆ నెంబర్ వాడకపోయినా.. అది వేరే వాళ్లది అని గుర్తించినా వెంటనే దానిని మార్చేసుకోవచ్చు.

మరోవైపు ఆధార్‌ కార్డులో తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆధార్‌ కార్డు అప్‌డేట్  చేసి 10 ఏళ్లు దాటితే.. వాళ్లు కచ్చితంగా అప్‌డేట్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలను ఉచితంగానే మార్చుకునే అవకాశం కల్పించింది.

కానీ ఉచితంగా మార్చుకునే గడువు డిసెంబర్‌ 14వ తేదీతో ముగిసినా  కూడా చాలామంది తమ వివరాలను అప్ డేట్ చేయలేదు. ఇది గమనించిన ప్రభుత్వం ఈ గడువును మరో 3 నెలలకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే వచ్చే ఏడాది మార్చి 14 వరకు ఉచితంగా ఆధార్‌ కార్డ్‌ వివరాలను  మార్చుకునే అవకాశం కల్పించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − three =