పలు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ECI Announces Election Schedule for 13 Rajya Sabha Seats Polling to be Held on March 31, 13 Rajya Sabha Seats Polling to be Held on March 31, ECI Announces Election Schedule for 13 Rajya Sabha Seats Polling, Election to 13 Rajya Sabha seats on March 31, Election Commission of India, Election Commission of India Announces Election to 13 Rajya Sabha seats, 13 Rajya Sabha Seats Polling, Rajya Sabha Seats Polling, Rajya Sabha Seats Polling to be Held on March 31, Rajya Sabha Seats Polling Latest News, Rajya Sabha Seats Polling Latest Updates, Rajya Sabha Seats Polling Live Updates, Rajya Sabha Seats, ECI, Mango News, Mango News Telugu,

దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 7, సోమవారం నాడు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 2, 2022న అస్సాం (02), హిమాచల్ ప్రదేశ్ (01), కేరళ (03), నాగాలాండ్ (01), త్రిపుర (01) లోని 8 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. అలాగే ఏప్రిల్‌ 4, 2022న పంజాబ్ రాష్ట్రానికి చెందిన 5 మంది సభ్యుల పదవీకాలం పూర్తవనుండడంతో మొత్తం 13 స్థానాలకు మార్చి 31వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని తెలిపారు.

పదవీకాలం పూర్తవుతున్న వారిలో కాంగ్రెస్ కీలక నేతలు ఆనంద్‌ శర్మ, ఏకే ఆంటోనీ సహా సుఖదేవ్‌ సింగ్‌, ప్రతాప్‌సింగ్‌ బైజ్వా, శ్వైత్ మాలిక్, నరేశ్‌ గుజ్రాల్‌, శంషేర్‌ సింగ్‌ డుల్లో, ఎంవీ శ్రేయమ్స్ కుమార్‌, కె.సోమప్రసాద్‌, రాణీ నరాహ్‌, రిపున్‌ బోరా, కె.జి. కెన్యే, జర్నా దాస్‌ ఉన్నారు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్:

  • రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌: మార్చి 14
  • నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు: మార్చి 21
  • రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన: మార్చి 22
  • నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: మార్చి 24
  • రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహణ: మార్చి 31 (ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌)
  • ఓట్ల లెక్కింపు పక్రియ: మార్చి 26 (సాయంత్రం 5 గంటల నుంచి).

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =