చంద్రయాన్-2 పంపిన తోలి చిత్రం విడుదల చేసిన ఇస్రో

chandrayaan 2, Chandrayaan 2 enters lunar orbit, chandrayaan 2 satellite latest news, Chandrayaan 2 successfully enters lunar, Chandrayaan 2 successfully enters lunar orbit, First Moon Image Captured by Chandrayaan 2, indian space research organisation, isro, ISRO About Chandrayaan 2 Satellite, Mango News Telugu, Moon Image Captured by Chandrayaan 2

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-2 ఉపగ్రహం తొలిసారిగా చంద్రుడి ఫోటో తీసి పంపించింది. ఆగష్టు 21, 2019 న చంద్రుడి ఉపరితలం నుండి సుమారు 2650 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 తీసిన మొదటి చంద్రుని చిత్రాన్ని చూడండి అంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం నాడు ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో మరే ఓరియంటల్ బేసిన్ మరియు అపోలో క్రేటర్స్ గుర్తించబడ్డాయి అని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-2 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత, బుధవారం నాడు ఉపగ్రహ కక్ష్యను మరింతగా తగ్గించారు. సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ సాఫీగా ల్యాండ్ అవనుంది. ల్యాండర్ విడిపోయిన తరువాత 14 రోజులపాటు చంద్రుడిపై పయనించి అక్కడి నుంచి తీసిన డేటాను భూమిపైకి పంపనుంది.

 

[subscribe]
[youtube_video videoid=QS5-fzTi_2o]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 1 =