జూన్‌లో కోవిడ్-19 నాల్గవ దశ!, కాన్పూర్ పరిశోధకుల అంచనా

IIT Kanpur Researchers Predicts that COVID-19 Fourth Wave Likely To Hit India Around June, IIT Kanpur Researchers, COVID-19 Fourth Wave, COVID-19 Fourth Wave Likely To Hit India Around June, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant,

భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్లే కనిపిస్తోంది. అయితే, ఇది తాత్కాలికమేనని.. రాబోయే 4 నెలల్లో ఇది మరోసారి దేశంపై విరుచుకుపడే అవకాశం ఉందని ఒక నివేదిక వెలుగుచూసింది. ఈ సంవత్సరం జూన్‌లో కోవిడ్-19 నాల్గవ దశ దేశాన్ని తాకే అవకాశం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక డేటా పరిశీలన అనంతరం.. నాల్గవ తరంగం జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు దాదాపు నాలుగు నెలల పాటు ఉండొచ్చని పరిశోధకుల అంచనా. ఐఐటీ కాన్పూర్‌లోని మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగానికి చెందిన సబర పర్షద్ రాజేష్‌భాయ్, సుభ్రాశంకర్ ధర్ మరియు శలభ్ ఈ పరిశోధన నిర్వహించారు. పరిశోధకులు తమ అంచనా కోసం కోవిడ్ గణాంక నమూనాను ఉపయోగించారు.

“బూట్‌స్ట్రాప్” పద్ధతి ఉపయోగించడం ద్వారా వారు నాల్గవ వేవ్ యొక్క పరిస్థితిని అంచనా వేయగలిగినట్లు తెలిపారు. ఈ పద్దతి ఉపయోగించి ఇతర దేశాలలో కూడా నాల్గవ వేవ్ తో పాటు భవిష్యత్తులో వచ్చే ఇతర వేవ్ లను అంచనా వేయవచ్చు అని వారు చెప్పారు. జూన్‌లో ప్రారంభమయ్యాక, ఆగష్టు 23 నాటికి ఇది గరిష్ట స్థాయికి చేరుకోనుంది. ఆ తర్వాత అక్టోబర్ 24 నాటికి ఇది ముగింపు దశకు చేరుకుంటుంది అని తెలిపారు. అధ్యయనం ప్రకారం.. రానున్న నాల్గవ కోవిడ్ వేవ్ యొక్క తీవ్రత ఇన్ఫెక్టిబిలిటీ, డెత్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇంకా  వ్యాక్సిన్స్, అలాగే బూస్టర్ డోసుల ప్రభావం మొదలైన వాటిని బట్టి కూడా దీని తీవ్రత ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 11 =