భారత్ vs ఆస్ట్రేలియా రెండో టెస్టు: 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం

India vs Australia 2nd Test: India Won by 8 Wickets,Ind Vs Aus Day 4 Full highlights,India won By 8 wickets,Ind Vs Aus Test,India vs Australia,India vs Australia highlights,India vs Australia 2nd Test Day 4 Highlights,India vs Australia 2nd Test Highlights 2020,India vs Australia 2nd Test Highlights,India vs Australia 4th day,India vs Australia Day 4 Highlights2020,Ind Vs Aus 2nd Test Day 4 Highlights 2020,Ind Vs Aus 2nd Test Highlights 2020,Ind Vs Aus Day 4 Highlights 2020,Australia vs India Cricket Highlights,India Vs Australia 2nd Test,India Win By 8 Wickets,Mango News,Mango News Telugu,India Won by 8 Wickets,India Beat Australia India Won By 8 Wickets

మెల్‌బోర్న్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో భారత్ జట్టు‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తోలి టెస్టులో ఆస్ట్రేలియా, రెండో టెస్టులో భారత్ గెలుపొందడంతో నాలుగు టెస్టుల సిరీస్ ఇప్పటికి‌ 1-1తో సమమైంది. రెండో ఇన్నింగ్స్ లో 133/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు‌ మరో 67 పరుగులు జోడించి 200 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. గ్రీన్‌(45), కమ్మిన్స్ (22), హాజిల్‌వుడ్ (10) పరుగులు చేశారు. ఈ టెస్టు ద్వారా అరంగ్రేట్రం చేసిన భారత్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ సత్తాచాటుతూ రెండో ఇన్నింగ్ లో 3 వికెట్లు తీసాడు. ఇక బుమ్రా, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలోనే ఘనవిజయాన్ని అందుకుంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(5), చటేశ్వర్ పుజారా (3) తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టగా, మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌(35) తో కలిసి కెప్టెన్‌ అజింక్య రహానె(27) ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జట్టును విజయం వైపు నడిపించాడు. తోలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న అజింక్య రహానే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గా నిలిచాడు. ఇక ఇరుజట్ల మధ్య మూడోటెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి జరగనుంది.

భారత్–ఆస్ట్రేలియా రెండో టెస్టు వివరాలు:

ఆస్ట్రేలియా తోలి ఇన్నింగ్స్: 195-10

  • లబుషేన్‌ (48), హెడ్ (38)
  • బుమ్రా 4/56, అశ్విన్ 3/35, సిరాజ్ 2/40

భారత్ తోలి ఇన్నింగ్స్: 326-10

  • అజింక్య రహానే (112), రవీంద్ర జడేజా (57), శుభ్‌మన్‌ గిల్‌(45)
  • మిచెల్ స్టార్క్ 3/78, లియాన్ 3/72

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్: 200-10

  • గ్రీన్‌(45), వేడ్ (40)
  • సిరాజ్ 3/37, బుమ్రా 2/54, అశ్విన్ 3/71, రవీంద్ర జడేజా 2/28

భారత్ రెండవ ఇన్నింగ్స్: 70-2

  • శుభ్‌మన్‌ గిల్‌(35), అజింక్య రహానె(27)
  • స్టార్క్ 1/20, కమ్మిన్స్ 1/22

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + seventeen =