తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

Mango News, Telangana Govt Decides To Fill 1698 Gurukul Posts, Telangana Govt to fill teachers vacancies, Telangana Gurukul posts, Telangana Political News, Telangana to fill up 1698 gurukul posts, TS Gurukulam Recruitment Latest News Updates, TS Gurukulam Vacancies To be Filled

తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, నిరుద్యోగ సమస్య పై మరింత దృష్టి సారించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించారు. అందులో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి ఖాళీలను గుర్తించి, వాటి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 1698 పోస్టులు భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇందులో 1071 టీజీటీ పోస్టులు, 119 పీఈటి పోస్టులు ఉన్నాయి. అంతే కాకుండా మరో 36 ప్రిన్సిపల్ సహా,ఇతర సంబంధిత ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కి సంబంధించి శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యువతీ యువకులకు, ప్రభుత్వం వెల్లడించిన ఈ ప్రకటన ఆనందాన్ని కలుగజేసింది. త్వరలోనే దీనికి గురించిన పరీక్షా తేదీలను నిర్ణయించి, అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here