దేశంలో మళ్ళీ పెరిగిన డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్‌ ధర, ఈసారి రూ. 50 పెంపు

LPG Price Hike Domestic Cylinder Rates Once Again Increased by Rs 50 in India, LPG Price Hiked Again, Domestic Cylinder Rates Once Again Increased by Rs 50 in India, Domestic Cylinder Rates Increased by Rs 50, Cooking Gas Rates Increased by Rs 50, Domestic LPG cylinder price hiked, liquefied petroleum gas price was hiked by Rs 50 per cylinder, LPG Price Hike, LPG cylinder price increased by Rs 50, price of domestic LPG cylinders was raised by Rs 50, Domestic Cylinder Rates Once Again Increased, Domestic Cylinder, Liquefied petroleum gas, LPG Price Hiked News, LPG Price Hiked Latest News, LPG Price Hiked Latest Updates, LPG Price Hiked Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియాలో మరోసారి LPG సిలిండర్ ధరలు పెరిగాయి. గతవారం వాణిజ్య LPG సిలిండర్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా దేశీయ LPG సిలిండర్ రేటు రూ.50 పెరిగింది. ఈ మేరకు 14 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ ఇంధన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ ఏజెన్సీల ప్రకారం, 14.2 కిలోల LPG సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 1000 పైనే ఉంది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే మరో రూ. 20 లేదా రూ. 30 కలిపితే సుమారు రూ. 1100 అవనుంది. ఇది సామాన్యుడిపై శరాఘాతమే. వంట గ్యాస్ సిలిండర్ల ధరలు చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో పెంచారు. ఆ సమయంలో కూడా రూ.50 పెరిగింది. నేటి ధరల పెరుగుదలతో, దేశీయ గ్యాస్ సిలిండర్ ధర గత ఒకటిన్నర నెలల్లో రూ. 100 పెరిగింది.

మరోవైపు 5 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ ధరను కూడా పెంచడంతో ప్రస్తుతం దీని ధర రూ. 655గా ఉంది. మే 1న, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరలు ₹ 250 పెరిగి ₹ 2,460 కి చేరుకుంది. వివిధ రాష్ట్రాల్లో విధించే విలువ ఆధారిత పన్ను మరియు ఇతర పన్నుల కారణంగా LPG సిలిండర్‌ల ధరలు నగరాల వారీగా మారుతూ ఉంటాయి. దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు ₹ 100 కంటే ఎక్కువగా ఉన్న సమయంలో దేశీయ గ్యాస్ సిలిండర్ల తాజా ధర పెంపుదల వచ్చింది. గత కొన్ని నెలలుగా డీజిల్, ఎల్‌పీజీ, పెట్రోల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దేశంలో నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి, ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 11 =