తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన: చంచల్ గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్

Congress Leader Rahul Gandhi Meets NSUI Leaders at Chanchalguda Jail Today, Rahul Gandhi Meets NSUI Leaders at Chanchalguda Jail Today, Rahul Gandhi Meets NSUI Leaders at Chanchalguda Jail, NSUI Leaders at Chanchalguda Jail, Rahul Gandhi Meets NSUI Leaders, Congress Leader Rahul Gandhi Meets NSUI Leaders at Chanchalguda Jail, NSUI Leaders, Chanchalguda Jail, Congress Leader Rahul Gandhi, Congress Leader, Rahul Gandhi, Former President Of INC, Rahul Gandhi Former President Of INC, Indian National Congress, Rahul Gandhi Telangana Tour, Rahul Gandhi Two Days Telangana Tour, Rahul Gandhi Two Days Visit To Telangana, Rahul Gandhi Telangana Tour News, Rahul Gandhi Telangana Tour Latest News, Rahul Gandhi Telangana Tour Latest Updates, Rahul Gandhi Telangana Tour Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. శనివారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకి చేరుకొని ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించారు. రాహుల్ గాంధీ ఓయూలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ తో ఇటీవల ఎన్‌ఎస్‌యూఐ నేతలు ధర్నా చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌ మీద చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జైల్లో ఉన్న విద్యార్ధి నాయకులను రాహుల్ గాంధీ కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అనుమతి కోరగా, జైలు అధికారులు మొదటగా అనుమతి ఇవ్వలేదు. పలు విజ్ఞప్తుల అనంతరం ఈ ఉదయం అనుమతి లభించింది.

అయితే రాహుల్‌ గాంధీతో పాటుగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మాత్రమే జైలులో ములాఖత్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో జైలులో ఉన్న బల్మూరి వెంకట్​ సహా 17 మంది ఎన్‌ఎస్‌యూఐ నేతలను రాహుల్ గాంధీ పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాటం చేయాలని, పార్టీ తరపున అండగా ఉంటామని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో చంచల్ గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + fourteen =