సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Covid 19 for sachin, COVID-19, COVID-19 News, Cricket icon Sachin Tendulkar, Mango News, Master Blaster Sachin Tendulkar Tested Positive, Master Blaster Sachin Tendulkar Tested Positive for COVID-19, sachin tendulkar corona positive, sachin tendulkar corona positive news, Sachin Tendulkar Tested Positive, Sachin Tendulkar Tested Positive for COVID-19, Sachin Tendulkar tests positive, Sachin Tendulkar tests positive for Covid-19

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడా, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ఇంట్లో మిగతా వారందరికీ నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను మరియు వైద్యుల సలహాల ప్రకారం అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాను. నాకు మరియు దేశవ్యాప్తంగా చాలా మందికి సహకరిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పలువురు క్రీడా, సినీ ప్రముఖులు, క్రీడాభిమానులు పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twelve =