సైప్రస్‌ లో బయటపడిన మరో కొత్త వేరియంట్‌ ‘డెల్టాక్రాన్‌’

New Covid Variant Named Deltacron Detected In Cyprus, New COVID-19 Variant, Deltacron In Cyprus, Deltacron covid variant, Deltacron variant, Deltacron variant in India, Deltacron variant south africa, covid-19 new variant, New Covid 19 Variant, New Covid Strain Deltacron, New Coronavirus Strain, Deltacron, Update on Deltacron, Deltacron covid variant, Deltacron variant, Mango News, Mango News Telugu,

ప్రపంచం ఇప్పటికే కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌తో వణికిపోతోంది. దీనికితోడు ఇప్పుడు ఇంకో కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. తాజాగా ఈ వేరియంట్‌ను సైప్రస్‌లో గుర్తించారు. ఈ కొత్త వైరస్ కి ‘డెల్టాక్రాన్’ అని పేరు పెట్టారు. దీనిలో.. డెల్టా వేరియంట్‌ లక్షణాలు మరియు ఒమిక్రాన్‌ లక్షణాలు ఉండటంతో ‘డెల్టాక్రాన్’ అని పేరుపెట్టారు. అయితే, ఈ కొత్త రకం వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. మరోవైపు ఈ డెల్టాక్రాన్ వేరియంట్ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పాలమని మరికొందరు అంటున్నారు.

కరోనా చికిత్స నిమిత్తం.. ఆస్పత్రిలో చేరిన బాధితుల నుంచి సేకరించిన కొన్ని నమూనాలలో ఇది గుర్తించబడింది. అయితే, సాధారణ ప్రజల నుంచి సేకరించిన కొన్ని నమూనాలలో కూడా ఇది బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. సైప్రస్‌లో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్లకు సంబంధించిన 10 మ్యూటేషన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. డెల్టాక్రాన్ వేరియంట్.. మ్యూటేషన్ల స్థాయి ఎక్కువగా ఉందని తెలిసింది. ఈ విషయాన్ని ఈ వేరియంట్‌ను కనుగొన్న సైప్రస్‌ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు లియోండస్‌ కోస్టిక్రిస్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =