పంజాబ్ పర్యటనలో ప్రధాని భద్రతా లోపంపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం

Hears Plea, investigate the breach in PM Modi’s security, Mango News, Modi Security Lapse, PM Modi, PM Modi Live Updates, PM Modi Updates, PM Modi’s Security Breach Issue, PM Narendra Modi, Prime Minister Narendra Modi, SC Orders Formation Of Panel, SC Orders Formation Of Panel To Probe PM Modi’s Security Breach Issue In Punjab, SC to Hear Petition on PM Modi, Security Breach Issue In Punjab, Supreme Court to hear plea on PM Modi security breach

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఏర్పడిన భద్రతా లోపంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్, పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. భద్రతా లోపంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో.. విచారణ కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు ప్రతిపాదనపై కేంద్ర సొలిసిటర్‌ జనరల్‌, పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ ఇద్దరూ సుముఖత వ్యక్తం చేశారు. ఈ విచారణ కమిటిలో సభ్యులుగా.. చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎన్ఐఏకు చెందిన ఐజీ, ఐబీ అధికారులు కూడా ఉంటారని, కమిటీలో పంజాబ్ నుంచి కూడా ప్రతినిధ్యం ఉంటుందని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.

వాదనల సందర్భంగా.. ప్రధాని భద్రతకు సంబంధించిన విషయంపై ఎస్‌పీజీ చట్టం ప్రకారం సంబంధిత అధికారులను ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని తెలిపారు సొలిసిటర్‌ జనరల్‌. ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని స్పష్టం చేశారు. ప్రధాని వాహనశ్రేణికి ముందు ఉన్న సెక్యూరిటీ వాహనం 100 మీటర్ల సమీపానికి వచ్చే వరకు పంజాబ్‌ అధికారులు రోడ్డు క్లియర్‌గా ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తన వాదనని వినిపించారు.

పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్ తన వాదనని వినిపించారు. విచారణ జరగకుండా, కనీసం తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కూడా లేకుండానే తమ రాష్ట్ర అధికారులకు కేంద్రం షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. అలాగే, దీనికి సంబంధించి ఇప్పటికే 7 షోకాజ్ నోటీసులు జారీ చేశారని ధర్మాసనానికి పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ వివరించారు. విచారణ జరగకుండా, కనీసం తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కూడా లేకుండానే తమ రాష్ట్ర అధికారులకు కేంద్రం షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =