కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కు రూ.4800 కోట్ల కేటాయింపుకు ఆమోదం

Union Cabinet Decisions: Approves Financial Allocation of Rs 4800 Cr for Vibrant Villages Programme,Union Cabinet Decisions,Approves Financial Allocation,Rs 4800 Cr for Vibrant Villages Programme,Mango News,Mango NEws Telugu,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గానూ కేంద్ర ప్రాయోజిత పథకం అయిన “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్” (వీవీపీ)కి రూ.4800 కోట్ల ఆర్థిక కేటాయింపులతో కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

ఈ పథకం ద్వారా దేశంలోని ఉత్తర సరిహద్దులోని బ్లాకుల్లో గల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని వారి స్థానిక స్థానాల్లో ఉండేలా ప్రజలను ప్రోత్సహించడంలో పాటుగా, ఆ గ్రామాల నుండి వలసలను తిప్పికొట్టడంతోపాటు సరిహద్దు భద్రతను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందన్నారు. దేశంలోని ఉత్తర భూ సరిహద్దు వెంబడి ఉన్న 4 రాష్ట్రాలు మరియు 1 యూటీలోని 19 జిల్లాలు మరియు 46 బోర్డర్ బ్లాక్‌లలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాల కల్పన కోసం ఈ పథకం నిధులను అందిస్తుందని, మొదటి దశలో 663 గ్రామాలలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో సహకారం కోసం భారత్ మరియు చిలీల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి కేబినెట్ ఆమోదం.
  • దేశంలో సహకార మూవ్ మెంట్ బలోపేతం చేయడానికి మరియు అట్టడుగు స్థాయి వరకు దాని విస్తృతిని పెంచడానికి కేబినెట్ ఆమోదించింది. ఇంకా కవర్ చేయని పంచాయతీలో ఆచరణీయమైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఏర్పాటు చేయడం, కవర్ కానీ ప్రతి పంచాయతీ/గ్రామంలో ఆచరణీయమైన పాల సహకార సంఘాలు ఏర్పాటు, ప్రతి తీరప్రాంత పంచాయతీ/గ్రామంలో, అలాగే పెద్ద నీటి వనరులు ఉన్న పంచాయతీ/గ్రామంలో ఆచరణీయమైన మత్స్య సహకార సంఘాలు మరియు ప్రస్తుతం ఉన్నపీఏసీలు/పాడి పరిశ్రమ/మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల బహుళార్ధసాధక పీఏసీలు/ డెయిరీ/ మత్స్య సహకార సంఘాలను స్థాపించడం ప్రారంభ లక్ష్యమని పేర్కొన్నారు.
  • డిజేబిలిటీ రంగంలో సహకారం కోసం భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి కేబినెట్ ఆమోదం.
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరియు ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఈడబ్ల్యూ) మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి కేబినెట్ ఆమోదం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =