ఢిల్లీలో పాలనాధికారంపై సుప్రీం చరిత్రాత్మక తీర్పు.. లా అండ్ ఆర్డ‌ర్ మిన‌హా స‌ర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే

SC Rules in Favour of Delhi Govt Over Control on Services Except For Public Order in National Capital,SC Rules in Favour of Delhi Govt,Delhi Govt Over Control on Services Except For Public Orde,SC Rules in National Capital,Mango News,Mango News Telugu,SC Rules In Favour Of Delhi Government,Delhi-Centre power row,Supreme Court rules in favour of Delhi government,delhi vs centre supreme court,Delhi govt wins Supreme Court battle,Delhi Govt vs Centre,SC Rules Latest News And Updates

దేశ రాజధాని ఢిల్లీలో పాలనాధికారంపై ఎన్నో ఏళ్లుగా ఢిల్లీ స‌ర్కార్‌ మరియు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. గురువారం దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. ఢిల్లీ ప్ర‌భుత్వానికి అధికారాలు లేవ‌న్న విష‌యాన్ని తాము అంగీక‌రించబోమ‌ని, ఈ కేసులో 2019 నాటి సింగిల్ జ‌డ్జీ తీర్పుతో ఏకీభ‌వించ‌డం లేద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం చేతుల్లోనే అధికారం ఉండాలని.. ఎల్జీ చేతుల్లో కాదని సుప్రీం తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వ అధికారాలను విస్తరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రభుత్వాధికారులపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండాలని.. లేదంటే బాధ్యతగా వ్యవహరించరని అభిప్రాయపడింది. ఇక దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాల త‌ర‌హాలోనే ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అయితే ల్యాండ్‌, పోలీస్‌, లాపై అధికారం కేంద్రానికి ఉంటుంద‌ని కోర్టు స్పష్టం చేసింది.

కాగా ఢిల్లీ ప్ర‌భుత్వం, ఎల్జీ మ‌ధ్య జ‌రిగిన వివాదంపై జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ 2019లో తీర్పును వెలువ‌రించారు. కాగా దేశ రాజధానిలో భారతదేశంలోని రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఎంతోమంది నివసిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఒకేచోట ఉంటారు. ఈ నేపథ్యంలో వారిలో ఎవరిని బిగ్ బాస్‌గా పరిగణించాలి? సువిశాల ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత వ్యవహారాలను నియంత్రించే కేంద్ర హోం మంత్రిత్వ శాఖనా? లేక ఏ విషయం పైన అయినా అంతిమ నిర్ణయాధికారి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన లెఫ్టినెంట్ గవర్నర్‌నా? అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, నగర పాలనను నిర్వహించే అధికారాలు గల ముఖ్యమంత్రినా? ఈ క్రమంలో తాజా సుప్రీం తీర్పుతో ఇన్ని రోజులూ సమాధానం లేని చిక్కు ప్రశ్నలుగా ఉన్న ఈ అన్ని సందేహాలకు పరిష్కారం దొరికినట్లయింది. ఇక ఈ తీర్పుతో కేంద్రంపై అలుపెరగని పోరాటం సలుపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఊరట లభించినట్లయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 14 =