తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు.. ‘దోస్త్’ షెడ్యుల్ విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ

Telangana Council of Higher Education Chairman Limbadri Released DOST Schedule For Online Admissions in Degree,Telangana Council of Higher Education,Education Chairman Limbadri Released DOST Schedule,DOST Schedule For Online Admissions,DOST Schedule For Online Admissions In Degree,Mango News,Mango News Telugu,DOST 2023 Notification Out,Education Chairman Limbadri,Telangana Higher Education Chairman Limbadri,Education Chairman Limbadri Latest News,DOST Latest News And Updates

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి విడుదల చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్‌ లింబాద్రి గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ప్రవేశం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, స్వయంప్రతిపత్తి కలిగిన కాలేజీలు, ప్రైవేట్, ఇతర కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తుంది. కాగా గత కొన్నేళ్లుగా ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు భారీగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య, క్వాలిఫైడ్‌ అధ్యాపకులుండటం, డిగ్రీలో ఎప్పకటిప్పుడు కొత్త కోర్సులు ప్రవేశపెడుతుండటం, కెరీర్‌ గైడెన్స్‌, క్లస్టర్‌ కాలేజీలు వంటి సంస్కరణల బాటపడుతుండటంతో విద్యార్థులు భారీగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మే, జూలై నెలల్లో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో ఈ దోస్త్ ప్రక్రియ ద్వారా లక్షల మంది విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు.

ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ లింబాద్రి దోస్త్ షెడ్యూల్‌ వివరాలను మీడియాకు వివరించారు. డిగ్రీ ప్రవేశాల కోసం చేపట్టిన దోస్త్‌ ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో సాగుతుందని, తొలివిడతలో ఈ నెల 16 నుంచి జూన్‌ 10 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. ఇక దీనికోసం ఈ నెల 20 నుంచి జూన్‌ 11 వరకు వెబ్‌ ఆప్షన్‌లు ఇవ్వాలని, జూన్‌ 16న డిగ్రీ సీట్లు కేటాయించనున్నామని చైర్మన్‌ లింబాద్రి వెల్లడించారు. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 16 నుంచి 26 మధ్య నిర్వహిస్తామని, జూన్ 16 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని, జూన్‌ 30న రెండో విడతలో సీట్లు కేటాయిస్తామని చెప్పారు. అలాగే మూడో విడత జూలై 1 నుంచి 5 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, జూలై 1 నుంచి 6 వరకు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుందని, అదే నెల 10న మూడో విడత సీట్లు ఎలాట్ చేస్తామని వివరించారు. కాగా రిజిస్ట్రేషన్‌ కోసం మొదటి విడతలో రూ.200, రెండు, మూడో విడతల్లో రూ.400 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 17 నుంచి మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =