సునందా పుష్కర్‌ మృతి కేసు : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ కు ఊరట

7 years of absolute torture, Congress MP Shashi Tharoor, Congress MP Shashi Tharoor cleared of charges by Delhi court, Congress MP Shashi Tharoor In Sunanda Pushkar Demise Case, Delhi Court Clears Congress MP Shashi Tharoor of All Charges, Delhi Court Clears Congress MP Shashi Tharoor of All Charges In Sunanda Pushkar Demise Case, Delhi court clears Shashi Tharoor, Mango News, Shashi Tharoor cleared of charges by Delhi court, Sunanda Pushkar, Sunanda Pushkar Demise Case

కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌ కు భారీ ఊరట లభించింది. తన భార్య సునందా పుష్కర్ మరణానికి సంబంధించిన కేసులో శశి థరూర్‌ పై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని సెషన్స్ కోర్టు కొట్టివేసింది. బుధవారం నాడు ఈ కేసుపై వర్చువల్ విచారణ జరగగా శశి థరూర్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శశిథరూర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, అతనిపై నమోదైన అన్ని అభియోగాలను కొట్టివేస్తునట్టు స్పెషల్ జడ్జి గీతాంజలి గోయల్ తీర్పు వెలువరించారు.

శశిథరూర్‌ భార్య సునందా పుష్కర్ జనవరి 17, 2014న ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించడంతో ఢిల్లీ పోలీసులు ముందుగా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. విస్తృత దర్యాప్తు అనంతరం శశి థరూర్‌పై హింసకు గురి చేయడం మరియు ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టుకు కేసు నివేదికను సమర్పించారు. ఈ కేసులో శశిథరూర్‌ ను ప్రధాన నిందితుడుగా పేర్కొనగా, ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. తాజాగా ఈ కేసుపై ఢిల్లీలోని సెషన్స్ కోర్టు విచారణ జరిపి, ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తునట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా శశిథరూర్‌ కోర్టుకు కృతజ్ఞతలు చెప్తూ, ఏడున్నర సంవత్సరాల సంపూర్ణ హింస నుంచి ఉపశమనం లభించిందని పేర్కొన్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 2 =