ఎర్ర‌కోట‌ను సంద‌ర్శించిన కేంద్ర ప‌ర్యాట‌క మంత్రి ప్రహ్లాద్ పటేల్

Mango News, Ministry Of Tourism, prahalad patel red fort visit, Prahlad Patel, Prahlad Patel Visited the Red Fort, Shri Prahlad Singh Patel, Tourism Minister Prahlad Patel, Tourism minister Prahlad Patel visit Red Fort, Tourism Minister Prahlad Patel Visited the Red Fort, Tourism Minister visits Red Fort, Union Culture and Tourism Minister Prahlad Patel

వ్య‌వ‌సాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ర్యాలీ సందర్భంగా కొందరు నిరసనకారులు ఎర్రకోట యొక్క ప్రాకారాలపైకి ఎక్కి నిశాన్ సాహిబ్ జెండాలను ఎగరవేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బుధవారం నాడు ఎర్రకోటను సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు. ముందుగా ఎర్రకోట వద్ద జరిగిన ఘటనను మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఖండించారు. ఎర్రకోట మన ప్రజాస్వామ్యానికి చిహ్నమని, ఎర్రకోట గౌరవాన్ని తగ్గించేలా వ్యవహారించడం విచారకరం మరియు దురదృష్టకరమని పేర్కొన్నారు. మరోవైపు నిరసనకారుల దాడిలో ఎర్రకోట ప్రాంగణంలో టికెట్ కౌంటర్, మెటల్ డిటెక్టర్ గేట్ సహా కొన్ని ధ్వంసం అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − four =