ఐఎండీబీలో 9.2 రేటింగ్ దక్కించుకున్న 12th ఫెయిల్

12Th Fail Which Got 9.2 Rating On IMBD, 12Th Got 9.2 Rating On IMBD, 12Th Got 9.2 Rating, 9.2 Rating 12Th Fail On IMBD, 12Th Fail, IPS Officer Real Story, 12Th Fail Which Got 9.2 Rating On IMBD, Shraddha Joshi, Manoj Kumar Sharma, Latest 12Th Fail Movie News, 12Th Fail Movie News, IMBD Latest News, Movie News, Lastest Film News, Mango News, Mango News Telugu
12th Fail,IPS officer real story, 12th Fail which got 9.2 rating on IMDb,Shraddha Joshi, Manoj Kumar Sharma

ఒక్కోసారి ఏ మాత్రం అంచనాలు లేకుండా తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. ఇలాంటి లిస్టులోకి వచ్చి చేరింది 12th ఫెయిల్ మూవీ. కేవలం రూ.20 కోట్ల బడ్డెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.66 కోట్లు వసూలు చేసేసింది. గతేడాది అక్టోబర్ 27 న రిలీజైన ఈ మూవీ..మొదట్లో పెద్దగా క్లిక్ అవకపోయినా.. తర్వాత  ఆడియన్స్ పల్స్ ను పట్టుకుని ది బెస్ట్ మూవీగా స్టాంప్ వేసేసుకుంది. చివరకు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటూ  ఐఎండీబీలో 9.2 రేటింగ్ తో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

గతేడాది హాలీవుడ్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్(అక్రాస్ ది స్పైడర్ వెర్స్), ఓపెన్‌హైర్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్, జాన్ విక్ చాప్టర్ 4 వంటి  మూవీల ఐఎండీబీ రేటింగ్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ ఈ 12th ఫెయిల్ మూవీ సాధించింది. సక్సెస్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ బయోగ్రఫీ ఈ సినిమా . అత్యంత పేదరికం నుంచి వచ్చిన మనోజ్.. అష్టకష్టాలు పడి అత్యంత కఠినమైన సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అవడం, ఇంత కష్టంలోనూ తన ప్రేమను దక్కించుకోవడం ఈ మూవీ కథ. మనోజ్ కుమార్ శర్మపై  అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్నే ఇప్పుడు 12th ఫెయిల్ గా విధూ వినోద్ చోప్రా  తెరకెక్కించాడు

మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని  బిల్‌గావ్ అనే గ్రామంలో మనోజ్ కుమార్ శర్మ 1977 లో జన్మించారు. మనోజ్ శర్మ తండ్రిది వ్యవసాయ శాఖలో ఉద్యోగం. చిన్నప్పుడు చాలా ఆర్ధిక సమస్యలతో పాటు, చదువు మీద కూడా పెద్దగా  ఆసక్తి ఉండేది కాదట. పదో తరగతి వరకూ  థర్డ్ క్లాస్ మార్కులతోనే పాస్ అయ్యారు. ఇక 12th లో అయితే  హిందీ తప్ప అన్ని సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యారట.

శ్రద్ధా జోషితో 12th లోనే  ప్రేమలో పడిన మనోజ్ కుమార్ శర్మ తాను ఫెయిల్ కావడంతో ఆమెకు ప్రపోజ్ చేయలేకపోయారట. చివరికి ప్రిలిమ్స్ కోసం అనుకోకుండా ఇద్దరు కలిసినప్పుడు ఆ పరిచయంతో ..ఆమెకు  ప్రపోజ్ చేశారట. ఓ వైపు కెరీర్, మరోవైపు  ప్రేమను దక్కించుకోవడానికి మనోజ్ శర్మ పడిన కష్టం ఆడియన్స్ మనసును గెలుచుకుంది.  తన ఫీజుల కోసం, కడుపు నింపుకోవడం కోసం ఢిల్లీలో చిన్నచిన్న పనులు కూడా చేశారు. UPSC CSE పరీక్షలో మూడుసార్లు ఫెయిల్ అయి..ఫోర్త్ అటెంప్ట్‌లో  121వ ర్యాంకుతో విజయం సాధించి.. IPS ఆఫీసర్ అయ్యారు మనోజ్ కుమార్ శర్మ. మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే సరిగ్గా సరిపోవడం ఈ మూవీకి కలిసి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ  డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + three =