తెలంగాణ ఎంసెట్-2023, పీజీఈసెట్-2023 షెడ్యూల్ విడుదల

Telangana EAMCET 2023 PGECET 2023 Entrance Exams Schedule Released, Telangana EAMCET 2023 Entrance, Telangana PGECET 2023 Entrance, EAMCET 2023 PGECET 2023 Exams Schedule, EAMCET PGECET 2023 Schedule Released, Mango News, Mango News Telugu, Ts Eamcet 2023,Ap Pgecet 2023 Notification,Eamcet 2023 Application Date,Eamcet 2023 Exam Date,Eamcet 2023 Exam Date Ts,Eamcet 2023 Preparation,Eamcet 2023 Syllabus,Pgecet Counselling Dates 2022 Telangana,Pgecet Rank Wise College Allotment Telangana,Pgecet Rank Wise Colleges In Telangana,Pgecet Telangana Test,Telangana Pgecet 2023,Telangana Pgecet 2Nd Counselling Date,Telangana Pgecet Counselling Dates 2023,Telangana Pgecet Exam Date 2023,Ts Eamcet 2023 Notification,Ts Eamcet 2023 Notification Date,Ts Eamcet 2023 Official Website,Ts Eamcet 2023 Syllabus,Ts Eamcet 2023 Syllabus Pdf,Ts Eamcet 2023 Weightage,Ts Pgecet Admissions,Ts Pgecet College Predictor,Ts Pgecet Counselling,Ts Pgecet Marks Vs Rank

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే టీఎస్ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఎంసెట్‌-2023 షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షను సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహించనున్నారు. మే 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు, మే 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 2023 సంవత్సరానికి గానూ ఎంసెట్ ప్రవేశ పరీక్షను జేఎన్టీయూహెఛ్ యూనివర్సిటీ నిర్వహించనున్న విషయం తెలిసిందే.

మరోవైపు రాష్ట్రంలో ఎంటెక్‌, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్‌-2023) షెడ్యూల్ ను కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. పీజీ ఈసెట్‌-2023 కోసం మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇక మే 29 నుంచి జూన్‌ 1 వరకు పీజీ ఈసెట్‌-2023 పరీక్షలు నిర్వహించనున్నారు. 2023 సంవత్సరానికి గానూ పీజీ ఈసెట్‌ పరీక్షను కూడా జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తుంది.

టీఎస్ ఎంసెట్-2023 పరీక్షషెడ్యూల్:

  • నోటిఫికేషన్‌ విడుదల: ఫిబ్రవరి 28
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 3
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : ఏప్రిల్ 10
  • దరఖాస్తు ఎడిట్ చేసుకునే అవకాశం: ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 వరకు
  • ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 15
  • ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 20
  • ఆలస్య రుసుము రూ.2500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 25
  • ఆలస్య రుసుము రూ.5000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 2
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : ఏప్రిల్ 30 నుండి
  • ఎంసెట్-2023 పరీక్ష నిర్వహణ (ఇంజినీరింగ్) : మే 7,8, 9
  • ఎంసెట్-2023 పరీక్ష నిర్వహణ (అగ్రికల్చర్, ఫార్మా‌ పరీక్షలు) : మే 10, 11

టీఎస్ పీజీ ఈసెట్‌-2023 షెడ్యూల్‌:

  • నోటిఫికేషన్‌ విడుదల: ఫిబ్రవరి 28
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 3
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : ఏప్రిల్ 30
  • దరఖాస్తు ఎడిట్ చేసుకునే అవకాశం: మే 2 నుంచి మే 4 వరకు
  • ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 5
  • ఆలస్య రుసుము రూ.1000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 10
  • ఆలస్య రుసుము రూ.2500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 15
  • ఆలస్య రుసుము రూ.5000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 24
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : మే 21 నుండి
  • పీజీ ఈసెట్‌-2023 పరీక్ష నిర్వహణ తేదీలు: మే 29 నుంచి జూన్‌ 1 వరకు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + sixteen =