శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 19వ పాఠంలో స్క్రీన్ ప్లే ఫార్మాట్స్ గురించి వివరించారు. కాగితం మీద అక్షరాలు చిత్రములుగా వెండితెర మీదకి అనువదింపబడడమే చిత్రానువాదం లేదా స్క్రీన్ ప్లే అంటారని చెప్పారు. ఈ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ చిత్రంలోని మొదటి సీన్ లో స్క్రీన్ ప్లే ఆధారంగా షాట్ డివిజన్ ఎలా జరిగింది? మరియు స్క్రీన్ ప్లే రాయడంలో పాటించాల్సిన నియమాలను పరుచూరి గోపాలకృష్ణ గారు వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]