రాష్ట్రప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

2021 Sri Rama Navami, CM KCR Extends Sri Rama Navami Greetings, CM KCR Extends Sri Rama Navami Greetings to People, CM KCR Extends Sri Rama Navami Greetings to People In The State, KCR Extends Sri Rama Navami Greetings, Sri Rama Navami, Sri Rama Navami 2021, Sri Rama Navami Celebrations, Sri Rama Navami Celebrations In Telangana, Sri Rama Navami Greetings, Sri Rama Navami In telangana, Sri Rama Navami News

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావం చేత సామూహికంగా జరుపుకోలేక పోతున్నామన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో దేవాలయ పూజారులు అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాములవారి కల్యాణ మహోత్సవాన్ని ఆన్లైన్ ప్రసారాల ద్వారా సీతారామభక్తులందరూ దర్శించుకోవాలని సీఎం కోరారు. లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని సీఎం తెలిపారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =