రాష్ట్ర ప్రతిష్ట, సంస్కృతిని ప్రతిబింబించేలా నూతన సచివాలయం – సీఎం కేసీఆర్

#KCR, CM KCR, CM KCR Review Meeting, KCR Review on New Secretariat Building, KCR Review on New Secretariat Building at Pragathi Bhavan, New Guidelines for Lockdown in Goa, New Secretariat Building, Telangana CM KCR, telangana secretariat, Telangana Secretariat Construction

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 17, శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ భవన సముదాయం అటు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా రూపొందాలని, అదే సందర్భంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలని అభిలషించారు.

‘‘తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. అదే సందర్భంగా పూర్తి సౌకర్య వంతంగా ఉండాలి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రధాన కార్యదర్శితో పాటు కార్యదర్శులు అంతా అందులోనే తమ విధులు నిర్వర్తించేలా ఉండాలి. గతంలో మాదిరిగా అక్కడొకరు ఇక్కడొకరు విసిరేసినట్లు ఉండొద్దు. మంత్రులు, కార్యదర్శులు ఒకే చోట ఉండాలి. సెక్రటేరియట్ సమీపంలోనే అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల సముదాయాన్ని కూడా నిర్మిస్తాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకే దగ్గర ఉంటుందని” సీఎం కేసీఆర్ వెల్లడించారు.

‘‘సెక్రటేరియట్ బాహ్య రూపం ఎంత హుందాగా, గొప్పగా ఉంటుందో లోపల కూడా అంత సౌకర్యవంతంగా, అన్ని వసతులతో ఉండాలి. దీనికి సంబంధించి మంత్రులు, కార్యదర్శుల చాంబర్లు, సమావేశ మందిరాలు, సిబ్బంది కార్యాలయాలు, లంచ్ హాల్స్, సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్, రికార్డు రూములు తదితరాలు ఎలా ఉండాలో నిర్ణయించాలని” సీఎం అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ స్థలంలోనే ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, క్రష్, విజిటర్స్ రూమ్, పార్కింగ్, భద్రతా సిబ్బంది నిలయం తదితర ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించాలని చెప్పారు. సౌకర్యాలు, సదుపాయాలు ఎలా ఉండాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకుని టెండర్లు పిలవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 8 =